Honda Amazon facelift: డిసెంబర్ 4న హోండా అమేజ్ 2024 లాంచ్.. సెడాన్‌లో కొత్త ఫీచర్లు!
జపనీస్ ఆటో దిగ్గజం హోండా తమ సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ 2024 ఫేస్‌లిఫ్ట్‌ను డిసెంబర్ 4న విడుదల చేయనుంది. ఇప్పటికే టీజర్ రూపంలో పలు వివరాలను వెల్లడించిన హోండా, తాజాగా లీక్ అయిన స్పై షాట్ల ద్వారా రాబోయే మోడల్‌కు సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించింది. LED హెడ్‌లైట్లు, DRL యూనిట్లు హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లను పోలి ఉండగా, మొత్తం ఫ్రంట్ డిజైన్ ఎలివేట్ SUV నుంచి ప్రేరణ పొందింది. నిలువుగా ఉండే బ్రేక్ లైట్లు, అధునీకరించిన బంపర్, నాలుగు పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
మారుతీ సుజుకీ డిజైర్ తో పోటీ
ఇంటీరియర్ డిజైన్, ఎలివేట్ SUVకు సమానమైన కొత్త డ్యాష్‌బోర్డ్, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డ్యూయల్ టోన్ బ్లాక్-బేజ్ ఇంటీరియర్ థీమ్ ఉన్నాయి. రేర్ ఏసీ వెంట్స్, చిన్న ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హోండా అమేజ్ హుడ్ కింద గత మోడల్‌లో అందించిన 1.2-లీటర్, నాలుగు సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించనుంది. 89 బీహెచ్‌పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హోండా అమేజ్ 2024 ప్రస్తుతం మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి సబ్-కాంపాక్ట్ సెడాన్లతో పోటీ పడనుంది.