Maruti Suzuki: మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ధర రూ.6.10 లక్షలు..Z-సిరీస్ ఇంజిన్ ప్రత్యేకతలివే..
ఈ వార్తాకథనం ఏంటి
మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.6.10 లక్షలుగా నిర్ణయించింది. 2026 వెర్షన్‌లో బాలెనోకు ఫీచర్లు, భద్రత, పవర్‌ట్రెయిన్ పరంగా కీలక మార్పులు చేశారు. డిజైన్‌లో మాత్రం స్వల్ప మార్పులే ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ కూడా ప్రస్తుత మోడల్ తరహాలోనే అదే సిల్హౌట్‌ను కొనసాగిస్తోంది. DRLలను కలిగి ఉన్న ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్ డిజైన్‌ను స్వల్పంగా మార్చారు. కొత్త డిజైన్ గ్రిల్‌తో పాటు, కొత్త డిజైన్ బంపర్‌ను కూడా అందించారు. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వెనుక భాగం కూడా ప్రస్తుత మోడల్‌కు చాలా దగ్గరగానే ఉంటుంది. కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తాయి.
వివరాలు
తొలిసారిగా ఫీచర్..
2026 మారుతి సుజుకి బాలెనో క్యాబిన్‌లో బ్లూ, బ్లాక్ రంగులతో డ్యూయల్‌టోన్ లేఅవుట్‌ను అందించారు.
డ్యాష్‌బోర్డ్ డిజైన్ ప్రస్తుత మోడల్‌ను పోలి ఉంటుంది. మధ్యలో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్రాథమిక నియంత్రణల కోసం ఫిజికల్ బటన్లు ఉన్నాయి.
స్టీరింగ్ వీల్ డిజైన్‌లో కూడా పెద్దగా మార్పులు చేయలేదు. స్టీరింగ్‌పై కంట్రోల్ బటన్లు కొనసాగుతున్నాయి.
కొత్త బాలెనోలో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లను అందించారు. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా ఈ ఫీచర్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
దీంతో పాటు వైర్‌లెస్ ఛార్జర్, క్లారియన్ సౌండ్ సిస్టమ్, TPMS, హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి.
వివరాలు
టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లతో పోటీ..
భద్రత విషయంలోనూ బాలెనోను మరింత మెరుగుపరిచారు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు.
అలాగే లెవల్ 2 ADAS ఫీచర్లలో భాగంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త బాలెనోలో 1.2-లీటర్ Z-సిరీస్ ఇంజిన్‌ను అందించారు. ఇదే ఇంజిన్‌ను గతంలో స్విఫ్ట్, డిజైర్ మోడళ్లలో అందించారు.
ఈ ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.
అంతేకాకుండా, తొలిసారిగా CNG వేరియంట్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తున్నారు.
దీంతో బాలెనో తన సెగ్మెంట్‌లో హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లతో పోటీని కొనసాగించనుంది.