LOADING...
Maruti Suzuki e-Vitara: రేపే భారత్‌లో మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV e-Vitara లాంచ్.. ధర, రేంజ్ వివరాలు ఇవే..
ధర, రేంజ్ వివరాలు ఇవే..

Maruti Suzuki e-Vitara: రేపే భారత్‌లో మారుతి తొలి ఎలక్ట్రిక్ SUV e-Vitara లాంచ్.. ధర, రేంజ్ వివరాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ SUV అయిన e-Vitaraను భారత్‌లో డిసెంబర్ 2న అధికారికంగా విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ కొత్త ఈవీ మోడల్‌ 49kWh,61kWh బ్యాటరీ ఆప్షన్లలో రానుంది. చైనా బ్యాటరీ దిగ్గజం BYD నుంచి తీసుకొచ్చిన LFP 'బ్లేడ్' సెల్స్‌ ఈ వాహనంలో ఉపయోగిస్తున్నారు. ధర విషయానికి వస్తే 49kWh వేరియంట్లకు రూ.17 లక్షల నుంచి రూ.22.5 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేసుకుంటున్నారు. పెద్ద 61kWh బ్యాటరీ వేరియంట్‌ ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫుల్‌ ఛార్జ్‌తో ముందు చక్రాల డ్రైవ్ సెటప్‌లో గరిష్ఠంగా 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

వివరాలు 

2023 ఆటో ఎక్స్‌పోలో చూపించిన eVX కాన్సెప్ట్‌కు దగ్గరగా డిజైన్ 

ఇంజిన్ పవర్ 142 నుంచి 172 హెచ్‌పీ వరకు ఉండగా, టార్క్ సుమారు 192.5Nm గా నమోదయ్యే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ఇది 2023 ఆటో ఎక్స్‌పోలో చూపించిన eVX కాన్సెప్ట్‌కు దగ్గరగా ఉంటుంది. మస్క్యులర్ లుక్‌తో, కింద భాగంలో డార్క్ క్లాడింగ్‌తో రగ్డ్ స్టైల్ కనిపిస్తుంది. ఈ కారు 4,275 మిమీ పొడవు, 1,800 మిమీ వెడల్పు, 1,635 మిమీ ఎత్తుతో 2,700 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీగా ఉంటుంది. లోపల క్యాబిన్‌లో ఫ్లోటింగ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, పియానో బ్లాక్ ఫినిష్, లేయర్డ్ స్టైల్ డాష్‌బోర్డ్ కనిపిస్తాయి.

వివరాలు 

వెనుక సీట్లకు కూడా మంచి స్పేస్‌, కంఫర్ట్

రెండు స్పోక్ స్టీరింగ్, సిల్వర్ ట్రిమ్ ఉన్న ఏసీ వెంట్స్, రోటరీ గేర్ కంట్రోలర్, ఫ్యాబ్రిక్-లెదరెట్ సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్, క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, అడాస్ ఫీచర్లు వంటి ఆధునిక టెక్నాలజీతో ఈ కారును సిద్ధం చేశారు. పొడవైన వీల్‌బేస్, ఎత్తైన స్టాన్స్ వల్ల వెనుక సీట్లకు కూడా మంచి స్పేస్‌, కంఫర్ట్ అందుతుందని సమాచారం.

Advertisement