Loading...
Maruti Suzuki: అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దూకుడు.. 25 శాతం పెరిగిన అమ్మకాలు
అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దూకుడు.. 25 శాతం పెరిగిన అమ్మకాలు

Maruti Suzuki: అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దూకుడు.. 25 శాతం పెరిగిన అమ్మకాలు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 02, 2026
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత కార్ల మార్కెట్‌లో మారుతీ సుజుకీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అక్టోబర్ 2026లో ఏకంగా 2,76,120 వాహనాలను విక్రయించి, కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో అమ్ముడైన 2,20,894 యూనిట్లతో పోలిస్తే ఈసారి విక్రయాలు 25 శాతం పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, యుటిలిటీ వాహనాలకు ఆదరణ కొనసాగడం, ఎగుమతులు గణనీయంగా పెరగడం ఈ రికార్డుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా ఒకే నెలలో దాదాపు 2.76 లక్షల వాహనాలు అమ్ముడవడం కంపెనీకి కీలక మైలురాయి.

Details

దేశీయ మార్కెట్‌లోనూ రికార్డు స్థాయి విక్రయాలు

అక్టోబర్‌లో మారుతీ మొత్తం అమ్మకాల్లో దేశీయ విక్రయాలు 2,16,789 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఇతర వాహన తయారీ సంస్థలకు సరఫరా చేసిన 9,459 యూనిట్లను కలిపితే దేశీయ అమ్మకాలు 2,26,248కు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,89,590 యూనిట్లుగా ఉంది.

ప్యాసింజర్ వాహన విభాగంలోనే 2,12,384 కార్లు అమ్ముడయ్యాయి.

ఆల్టో, బాలెనో, స్విఫ్ట్, డిజైర్, వ్యాగన్‌ఆర్ వంటి మోడళ్లతో కూడిన ప్యాసింజర్ కార్ల విభాగం 1,00,877 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 18.4 శాతం వృద్ధి.

Details

ఎస్‌యూవీలకు పెరుగుతున్న ఆదరణ

మారుతీ అమ్మకాల వృద్ధిలో యుటిలిటీ వాహనాల పాత్ర ప్రత్యేకంగా కనిపించింది. బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, జిమ్నీ, విక్టోరిస్ వంటి మోడళ్లతో కూడిన ఈ విభాగంలో 97,787 యూనిట్లు అమ్ముడయ్యాయి.

గత ఏడాది ఇదే నెలలో నమోదైన 77,571 యూనిట్లతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. ఇక ఈకో వ్యాన్ విక్రయాలు 13,720 యూనిట్లకు చేరగా, సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వాహనం 4,405 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

ADVERTISEMENT

Details

ఎగుమతుల్లో భారీ వృద్ధి

అక్టోబర్‌లో మారుతీ సుజుకీ ఎగుమతులు 49,872 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 31,304 వాహనాలు మాత్రమే ఎగుమతి కాగా, ఈసారి 59.3 శాతం వృద్ధి నమోదైంది.

ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు 7 నెలల కాలంలో మొత్తం అమ్మకాలు 16,55,498 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 12,99,629 యూనిట్లతో పోలిస్తే 27.4 శాతం పెరిగాయి.

ఈ కాలంలో దేశీయ అమ్మకాలు, OEM సరఫరాలు కలిపి 13,72,771 యూనిట్లకు చేరగా, ఎగుమతులు 2,82,727 యూనిట్లుగా నమోదయ్యాయి.

దేశీయ డిమాండ్‌తో పాటు విదేశీ మార్కెట్లలోనూ మారుతీ వాహనాలకు ఆదరణ పెరుగుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT