Loading...
Maruti Suzuki: మారుతి సుజుకి కీలక నిర్ణయం.. ఇక రైళ్లలోనూ కార్ల డెలివరీలు!
మారుతి సుజుకి కీలక నిర్ణయం.. ఇక రైళ్లలోనూ కార్ల డెలివరీలు!

Maruti Suzuki: మారుతి సుజుకి కీలక నిర్ణయం.. ఇక రైళ్లలోనూ కార్ల డెలివరీలు!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 26, 2026
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతి సుజుకి దక్షిణ భారతదేశంలో రైలు మార్గం ద్వారా వాహనాల రవాణాను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడులోని పొల్లాచ్చి రైల్వే టెర్మినల్‌కు మారుతి సుజుకి నుంచి వాహనాలతో కూడిన తొలి ఆటోమొబైల్ రేక్ చేరుకుంది. దీంతో ఈ టెర్మినల్‌కు రైలు మార్గంలో వాహనాలను పంపించిన తొలి ప్యాసింజర్ వెహికల్ తయారీ సంస్థగా మారుతి సుజుకి నిలిచింది. ఆగస్టు 18, 2026న మనేసర్‌లోని కంపెనీ ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ నుంచి ఈ రేక్‌ను ప్రారంభించారు. ఇందులో వాగన్ ఆర్, ఎర్టిగా, డిజైర్, సెలెరియో వంటి మోడళ్లకు చెందిన మొత్తం 120 వాహనాలు ఉన్నాయి.

వివరాలు

రైలు మార్గం ద్వారా వాహనాల రవాణా..

పొల్లాచ్చి రైల్వే టెర్మినల్‌ను రైలు మార్గం ద్వారా వాహనాల రవాణాకు అందుబాటులోకి తీసుకురావడంలో మారుతి సుజుకి, భారతీయ రైల్వేలతో కలిసి పనిచేసింది.

కోయంబత్తూరుతో పాటు ఇప్పుడు మరో గమ్యస్థానానికి రైలు మార్గంలో వాహనాలను పంపించే అవకాశం లభించింది.

దక్షిణ భారతదేశంలోని వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించగలమని కంపెనీ తెలిపింది.

కేరళలో ఓనం పండుగకు ముందు ఈ రైలు రవాణా ప్రారంభం కావడం వల్ల పండుగ సమయంలో పెరిగే వాహనాల డిమాండ్‌ను అందుకోవడంలో కంపెనీకి ఇది ఉపయోగపడనుంది.

పొల్లాచ్చి రైల్వే టెర్మినల్ ద్వారా ఏడాదికి దాదాపు 70 ఆటోమొబైల్ రేక్‌లను రవాణా చేయవచ్చని అంచనా.

ప్రతి ఏడాది అదనంగా 11,000కు పైగా వాహనాలను రైలు మార్గంలో ఈ ప్రాంతానికి తరలించే అవకాశం ఉంటుంది.

వివరాలు

ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా మారుతి సుజుకి..

ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలను నియంత్రించడం, రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా మారుతి సుజుకి 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి రైలు మార్గంలో వాహనాల రవాణాను ప్రారంభించింది.

అప్పట్లో కంపెనీ మొత్తం వాహనాల రవాణాలో రైలు వాటా కేవలం 5 శాతంగా ఉండగా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అది 26.5 శాతానికి పెరిగింది.

ఇప్పటివరకు రైలు మార్గంలో కంపెనీ మొత్తం 32 లక్షలకు పైగా వాహనాలను రవాణా చేసింది.

2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి రైలు ఆధారిత వాహనాల రవాణా వాటాను 35 శాతానికి పెంచాలని మారుతి సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT

వివరాలు

కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌..

ఇదిలా ఉంటే.. మారుతి సుజుకి ఇటీవల తన సబ్-4 మీటర్ ఎస్‌యూవీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.39 లక్షలుగా ఉంది. బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో రెండు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి.

1.0 లీటర్, మూడు సిలిండర్ల టర్బోచార్జ్డ్ బూస్టర్‌జెట్ ఇంజిన్ 109 పీఎస్ పవర్, 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దీనిని 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

సెప్టెంబర్ 5న లాంచ్..

మరోవైపు 1.5 లీటర్ K15C నాలుగు సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 103 పీఎస్ పవర్, 139 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.

మారుతి సుజుకి తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోకు అప్‌డేటెడ్ వెర్షన్‌ను కూడా భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

సెప్టెంబర్ 5న ఈ కొత్త బాలెనోను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇందులో ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో మార్పులతో పాటు ఇంటీరియర్‌లోనూ కొన్ని అప్‌డేట్లు, కొత్త ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ అందించే అవకాశం ఉంది.

ADVERTISEMENT