LOADING...
Maruti Suzuki Victoris : మారుతీ సుజుకీ విక్టోరిస్ లాంచ్‌.. వేరియంట్లు, ఫీచర్ల పూర్తి వివరాలివే!
మారుతీ సుజుకీ విక్టోరిస్ లాంచ్‌.. వేరియంట్లు, ఫీచర్ల పూర్తి వివరాలివే!

Maruti Suzuki Victoris : మారుతీ సుజుకీ విక్టోరిస్ లాంచ్‌.. వేరియంట్లు, ఫీచర్ల పూర్తి వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతీ సుజుకీ ఇటీవల భారత మార్కెట్లోకి తన కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'విక్టోరిస్'ను విడుదల చేసింది. ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి మోడళ్లతో పోటీ నెలకొన్న ఈ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టిన విక్టోరిస్ విభిన్న ఇంజిన్ ఆప్షన్లు, పలు వేరియంట్లతో కస్టమర్లను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కారు కొనాలనుకునే వారు ఎలాంటి వేరియంట్‌ను ఎంచుకోవాలి? అనే ప్రశ్న వస్తుంది. ఈ నేపథ్యంలో విక్టోరిస్ వేరియంట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

Details

 విక్టోరిస్ వేరియంట్లు, ఫీచర్లు

1. ఎల్‌ఎక్స్‌ఐ (బేస్ వేరియంట్) స్టీల్ వీల్స్, హాలోజన్ ల్యాంప్స్, మాన్యువల్ ఏసీ భద్రత కోసం డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఐఎస్‌ఓఫిక్స్ మౌంట్‌లు తక్కువ బడ్జెట్ ఉన్నవారికి సరిపోతుంది కానీ ఫీచర్లు పరిమితం 2. వీఎక్స్‌ఐ 7-ఇంచ్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ పవర్-ఫోల్డింగ్ మిర్రర్స్ కంఫర్ట్ పెరుగుతాయి కానీ ఎక్కువ ఫీచర్ల కోసం చాలామంది పై వేరియంట్లను ఎంచుకునే అవకాశం

Details

3. జెడ్‌ఎక్స్‌ఐ 

ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్‌లు, అల్లాయ్ వీల్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ ప్రీమియం క్యాబిన్ సీఎన్జీ ఆప్షన్ ఇక్కడివరకే లభ్యం ధర-ఫీచర్ల మధ్య మంచి బ్యాలెన్స్ కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ 4. జెడ్‌ఎక్స్‌ఐ+ / జెడ్‌ఎక్స్‌ఐ+ (O) 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ క్లస్టర్ పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వెంటిలేటెడ్ సీట్లు, లెవల్ 2 ADAS హైబ్రిడ్ వెర్షన్‌లలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా లభ్యం అన్ని సౌకర్యాలు కావాలనుకునే వారికి అద్భుతమైన ఎంపిక, కానీ ధర ఎక్కువ

Details

 ఇంజిన్ ఆప్షన్లు 

1. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 101 బీహెచ్‌పీ పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ 2. 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ 114 బీహెచ్‌పీ పవర్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్ ఇంధన సామర్థ్యంపై దృష్టి పెట్టే వారికి ఉత్తమ ఎంపిక

Details

3.  సీఎన్జీ వెర్షన్ 

87 బీహెచ్‌పీ పవర్, 121 ఎన్ఎమ్ టార్క్ కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభ్యం మొత్తం మీద బడ్జెట్‌కి అనుగుణంగా వేరియంట్ ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ ఖర్చు కోసం ఎల్‌ఎక్స్‌ఐ కంఫర్ట్ కోసం వీఎక్స్‌ఐ ధర-ఫీచర్ల మధ్య బ్యాలెన్స్ కోసం జెడ్‌ఎక్స్‌ఐ లగ్జరీ అన్ని టాప్ ఫీచర్ల కోసం జెడ్‌ఎక్స్‌ఐ+ సరైనవి.