టాగా టియోగా ఈవీకి పోటీగా ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు.. నేడే లాంచ్
ఇండియాలో కామెట్ ఈవీని ప్రారంభిస్తున్నట్లు ఎంజీ మోటర్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే ఈ కారు వివరాలను ఎంజీ మోటర్ తెలియజేసింది. నేడే ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ కానుంది. ఎంజీ జెడ్ ఎస్ ఈవీ తర్వాత ఇండియన్ మార్కెట్లో ఆ సంస్థ ప్రారంభిస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ కారు ధర, వివరాలను తెలుసుకుందాం. ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు క్యాబిన్ లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, 10.25 ఇంచుల సైజ్ ఉండే రెండు డిస్ ప్లేలు ఉండడం దీని ప్రత్యేకత. ఈ కారుని ఒక్కసారి ఛార్జీ చేస్తే 250 కిలోమీటర్ల వరకూ ప్రయాణించనుంది.
గంటకు వంద కిలోమీటర్ల వేగం
అదే విధంగా 17.3 kWh బ్యాటరీతో రానుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ఈ కారు లెంగ్త్ 2,974 మిల్లీమీటర్లు, వెడల్పు 1,505 మిల్లీమీటర్లుగా ఉంటుంది. టాటా టియాగో ఈవీలా స్మాల్ ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ కామెట్ ఈవీ ముందుకొస్తోంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10లక్షల వరకూ ఉండనుంది. అయితే టాటా టియాగో ఈవీ, సిట్రొయిన్ ఈసీ3 మోడళ్లతో ఈ కామెట్ ఈవీ పోటీ పడనుంది. అయితే టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర (రూ.8.69లక్షలు ఎక్స్-షోరూమ్) కంటే ఎంజీ కామెట్ ఈవీ ధర కాస్త ఎక్కువగానే ఉండనుంది.