Page Loader
Royal Enfiled: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బుల్లెట్.. ఫీచర్స్ సూపర్బ్! 
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బుల్లెట్.. ఫీచర్స్ సూపర్బ్!

Royal Enfiled: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బుల్లెట్.. ఫీచర్స్ సూపర్బ్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2023
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్ రానుంది. ఈ బైక్ అంటే ఇప్పటికీ యువతలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకూ సంప్రదాయ పద్ధతుల్లో బైకులు ఆవిష్కరించిన రాయల్ ఎన్‌ఫీల్డ్, ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా అధునాతన టెక్నాలజీతో సరికొత్త బైకును తీసుకొచ్చింది. ఇటీవల బుల్లెట్ 350 బైకును ఆవిష్కరించిన రాయల్ ఎన్ ఫీల్డ్, తాజాగా మరో ఫ్లెక్స్ ఫ్యుయల్ మోటర్ సైకిల్ ను ఆవిష్కరించింది. వచ్చే త్రైమాసికంలో ప్లెక్స్ ఫ్యుయల్ మోటర్ సైకిల్ ను రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ తీసుకురానుంది.

Details

ఫ్యుయల్ మోటర్ సైకిల్ ను మొదటిసారిగా ఆవిష్కరించిన టీవీఎస్ మోటర్

రాయల్ ఎన్‌ఫీల్డ్ పాపులర్, బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిళ్లతో 'క్లాసిక్-350' బైక్‌ని ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌గా ఆధునీకరించనట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు హోండా మోటార్ సైకిల్స్ కూడా భారత్ మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యుయల్ మోటర్ సైకిళ్లను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దేశీయ మార్కెట్లో ప్లెక్స్ ఫ్యుయల్ మోటర్ సైకిల్‌గా ఆవిష్కరించిన సంస్థగా టీవీఎస్ మోటార్ కంపెనీ నిలవనుంది. ఇథనాల్, పెట్రోల్ మిక్సింగేనే ఫ్లెక్స్ ఫ్యుయల్ అని అంటాం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ ఆధారిత బైక్‍లు సేల్ అవుతుండడం విశేషం.