వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థ OLA ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, మోటార్‌బైక్‌లు, స్కూటర్‌లు, వంటి వాణిజ్య వాహనాలను కూడా తయారు చేయనుందని రాబోయే 12 నెలల్లో ఈ ఉత్పత్తులపై మరిన్ని ప్రకటనలను వింటారని ఆ సంస్థ సహా వ్యవస్థాపకులు భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ తన కోర్ టెక్నాలజీని స్థాపించింది కాబట్టి అధిక ఫ్రీక్వెన్సీలో ఉత్పత్తులు ప్రారంభించబడతాయని ఆయన అన్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలపై పనిచేసే బృందాలు ఉన్నాయి, వాణిజ్య వాహనాలపై పనిచేసే టీమ్‌లు ఉన్నాయని వాటినే వాణిజ్య వాహనాల ఉత్పత్తి కోసం వాడతామని అగర్వాల్ తెలిపారు. వీటి అమ్మకాలు డీలర్‌షిప్ మోడల్‌లో అమలు చేయనందున ఎక్కువ ప్రకటనల కోసం ఖర్చు చేయమని ఆయన సృష్టం చేశారు.
భారతదేశం వెలుపల మార్కెట్‌లకు విస్తరించేందుకు ప్రణాళికలు
సొంతంగా బ్యాటరీ సెల్‌లను తయారు చేసుకునేందుకు కూడా తమ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అగర్వాల్ చెప్పారు. రాబోయే సంవత్సరంలో, కంపెనీ యూరప్, లాటిన్ అమెరికా వంటి భారతదేశం వెలుపల మార్కెట్‌లకు విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తుంది. "ఈ విభాగాలలో ఒకప్పుడు జపనీయుల ఆధిపత్యం ఉండేది. మాకు టయోటా, యమహా, హ్యుందాయ్, హోండా, కవాసకి, నిస్సాన్ ఉన్నాయి. జపనీయులు EVలను అనుకున్నంత స్వీకరించలేదు కానీ ప్రపంచం నేటి యుగంలో EVల వైపు కదులుతోంది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు, EV విభాగాలలో కూడా ప్రపంచానికి అగ్రగామిగా భారతీయ కంపెనీ ఉండాలి" అంటూ ముగించారు భవిష్ అగర్వాల్.