Rilox EV: అర్బన్ లాజిస్టిక్స్ కోసం Bijli Trio ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విడుదల
ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల్లో ఒకటైన రిలాక్స్ (Rilox) ఈవీ తాజాగా బిజిలీ ట్రియో అనే మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. ఈ వాహనాన్ని ముఖ్యంగా సరుకు రవాణా, భారీ వస్తువుల తేలికపాటి రవాణా అవసరాలకు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వాహనం ప్రారంభ ధరను రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. అయితే, ఈ ధర ప్రాంతానుసారం మారే అవకాశం ఉంది.
డెలివరీ సేవలకు అనువైన డిజైన్
బిజిలీ ట్రియోను ప్రత్యేకంగా సరుకుల రవాణా, డెలివరీ సేవల కోసం రూపొందించారు. వ్యక్తిగత ప్రయాణ అవసరాలకు ఇది అనుకూలం కాదు, ఎందుకంటే డ్రైవర్ సీటు మినహా అదనపు సీటింగ్ ఏర్పాట్లు లేవు. పట్టణాల్లో సరుకుల రవాణా సమస్యలను పరిష్కరించడంలో ఈ వాహనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది 500 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. బ్యాటరీ,పనితీరు ఈ వాహనంలో 3 KW ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఫుల్ ఛార్జ్‌తో ఈ వాహనం 100-120 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 500 కిలోల బరువును లాగడానికి శక్తివంతమైన 1200W IP67 సర్టిఫైడ్ మోటార్ అమర్చారు. అదనంగా 15 ట్యూబ్ సిన్ వేవ్ కంట్రోలర్ మరియు MCP (40 ఆంప్స్ రేట్) ఉపయోగించారు.
డిజైన్ హైలైట్స్
ఈ వాహనంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, విశాలమైన కార్గో ఏరియా, మరియు మన్నికైన అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ ఉన్నాయి. ఇది ఎక్కువ బరువును ఎక్కువసేపు మోసుకెళ్లడంలో సహాయపడుతుంది. వాణిజ్య అవసరాలకు అనుకూలం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే తమ డెలివరీ కార్యకలాపాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతున్నాయి. రిలాక్స్ ఈవీ తీసుకొచ్చిన బిజిలీ ట్రియో, ఈ తరహా సంస్థలకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రత్యేకతలతో బిజిలీ ట్రియో, పట్టణాల్లో కార్గో ట్రాన్స్‌పోర్టేషన్‌ను విప్లవాత్మకంగా మార్చే అవకాశముంది.