Page Loader
Skoda kodiaq 2025: భారతదేశంలో లాంచ్ అయిన  స్కోడా కోడియాక్ 2025.. ధర ఎంతంటే..?

Skoda kodiaq 2025: భారతదేశంలో లాంచ్ అయిన  స్కోడా కోడియాక్ 2025.. ధర ఎంతంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కోడా ఆటో ఇండియా తన రెండో తరం 2025 కోడియాక్ మోడల్‌ను అధికారికంగా భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీని కంపెనీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. స్పోర్ట్‌లైన్, ఎల్ అండ్ కే వెర్షన్లు. వాటిని ఏడు ఆకర్షణీయ రంగులలో అందిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో పాటు తాజా ఫీచర్లు ఈ వాహనంలో చేరడం ద్వారా కోడియాక్ మరింత ఆకర్షణీయంగా మారింది.

వివరాలు 

విభిన్నమైన డిజైన్ హైలైట్స్ 

కొత్తగా డిజైన్ చేసిన బంపర్లు, శక్తివంతమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంపులు, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, సీ ఆకారంలో రూపుదిద్దుకున్న టెయిల్ లైట్లు, స్టైలిష్ రూఫ్ రెయిల్స్ వంటి ఎలిమెంట్లు కొత్త కోడియాక్‌కు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నాయి. వీటి వల్ల కారుకు ప్రీమియం లుక్ వస్తుంది. సైడ్ ప్రొఫైల్, డైమెన్షన్ విశేషాలు ఈ ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్‌లో క్యారెక్టర్ లైన్లు లేకపోవడం వల్ల కారు మరింత పొడవుగా కనిపిస్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 15 అడుగులు 7 అంగుళాలు. వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు కారుకు స్టైలిష్ రూపాన్ని కలిగిస్తున్నాయి.

వివరాలు 

ఇంటీరియర్,టెక్నాలజీ ఫీచర్లు 

ఇంటీరియర్‌లో మృదువైన మెటీరియల్స్ వాడటం ద్వారా లగ్జరీ అనుభూతిని కలిగించేలా రూపొందించారు. మసాజ్ ఫంక్షన్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి సౌకర్యాలు ఈ వాహనంలో ఉన్నాయి. మొబైల్ ఛార్జింగ్ కోసం సీట్ల వద్ద ప్రత్యేకంగా సీ-టైప్ ఛార్జింగ్ పోర్టులు కూడా ఉన్నాయి. 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే, 10 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ముందు సీట్లలో హీటింగ్ & వెంటిలేషన్ ఫీచర్లు, మసాజ్‌తో పాటు స్లైడింగ్, రిక్లైనింగ్ సీట్లు.. ఇవన్నీ ప్రయాణికులకు అత్యధిక సౌలభ్యాన్ని కలిగించేలా ఉన్నాయి. 13 స్పీకర్లతో కూడిన సబ్‌వూఫర్ సహిత ఆడియో సిస్టమ్ మ్యూజిక్ అనుభూతిని మరింత మెరుగుపరుస్తుంది.

వివరాలు 

భద్రతా ఫీచర్లు 

భద్రతను దృష్టిలో ఉంచుకుని స్కోడా ఈ వాహనాన్ని రూపొందించింది. మొత్తం 9 ఎయిర్‌బ్యాగ్స్ అందించడంతో పాటు 360 డిగ్రీల వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీ, హిల్ స్టార్ట్ అసిస్టెంట్, హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి.

వివరాలు 

ఇంజిన్, పనితీరు 

ఈ వాహనంలో 2.0 లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (DCT) సిస్టమ్‌ ద్వారా 201 బీహెచ్‌పీ శక్తిని, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. శక్తివంతమైన పనితీరుతో డ్రైవింగ్ అనుభవం మరింత రిఫైన్‌డ్‌గా ఉంటుంది. ధర వివరాలు,మార్కెట్ పోటీ స్పోర్ట్‌లైన్ వేరియంట్ ధరను రూ. 46.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, ఎల్ అండ్ కే వెర్షన్ ధర రూ. 48.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కోడా కోడియాక్ తాజా వెర్షన్ మార్కెట్లో ప్రవేశించడంతో టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్ వంటి భారీ ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇవ్వగలదని పరిశీలకులు భావిస్తున్నారు.