Skoda Kylaq: 4 వేరియంట్లలో స్కోడా కైలాక్ .. అన్ని వేరియంట్ల ధరల్ని ప్రకటించిన సంస్థ.. ప్రారంభమైన బుకింగ్
స్కోడా ఇండియా తాజాగా భారతీయ మార్కెట్‌లో "కైలాక్"ను ప్రవేశపెట్టింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో ఈ కొత్త ఎంట్రీ మరిన్ని పోటీలను ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి పాపులర్ మోడల్స్ ఉన్నప్పటికీ, కైలాక్ అందుబాటులోకి రాగానే ఈ పోటీ మరింత ఉత్కంఠ రేపుతుంది. స్కోడా కైలాక్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం, ఈ కారుకు 4 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో క్లాసిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.89 లక్షలు. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్+, మరియు ప్రెస్టీజ్ వేరియంట్లలో స్కోడా కైలాక్ అందించబడుతుంది.
వేరియంట్ ధరలు, బుకింగ్స్:
సిగ్నేచర్ వేరియంట్: మాన్యువల్ ₹9.59 లక్షలు, ఆటోమేటిక్ ₹10.59 లక్షలు సిగ్నేచర్+ వేరియంట్: మాన్యువల్ ₹11.40 లక్షలు, ఆటోమేటిక్ ₹12.40 లక్షలు ప్రెస్టీజ్ వేరియంట్: మాన్యువల్ ₹13.35 లక్షలు, ఆటోమేటిక్ ₹14.40 లక్షలు బుకింగ్స్ ఈ రోజు (డిసెంబర్ 2) నుంచి ప్రారంభమయ్యాయి, డెలివరీలు 2025 జనవరి 27 నుండి ప్రారంభమవుతాయి.
ప్రత్యేక ఆఫర్
ప్రథమ 33,333 కస్టమర్లకు 3 సంవత్సరాల సాండర్డ్ మెయింటనెన్స్ ప్యాకేజీని ఫ్రీగా అందిస్తున్నారు. ఈ ప్యాకేజీ ద్వారా, మొదటి 5 సంవత్సరాల్లో కార్ మెయింటనెన్స్ ఖర్చులు కిలోమీటర్‌కు ₹0.20 తగ్గుతాయని కంపెనీ వెల్లడించింది. కైలాక్ 8 లక్షల కిలోమీటర్ల పైగా కఠినమైన పరీక్షలను జయించింది. కైలాక్ 7 రంగులలో అందుబాటులో ఉంటుంది: టోర్నాడో రెడ్, బ్రిలియంట్ సిల్వర్, కాండీ వైట్, కార్బన్ స్టీల్, లావా బ్లూ, డీప్ బ్లాక్, ఆలివ్ గోల్డ్.