Tata Car: టాటాకార్ల వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరిక..అజాగ్రత్తగా ఉంటే
ఈ వార్తాకథనం ఏంటి
టాటా కారు మీ ఫోన్‌తోనే లాక్ అవుతోంది.. లైవ్ లొకేషన్ కనిపిస్తోంది.. ఫ్యూయల్, బ్యాటరీ స్థాయి కూడా క్షణాల్లో తెలుసుకుంటున్నారు. కానీ ఇదే స్మార్ట్ ఫీచర్లు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆందోళనకు కారణమయ్యాయి. టాటా మోటార్స్‌కు చెందిన కనెక్టెడ్ వెహికల్ యాప్స్‌లో భద్రతా లోపాలను గుర్తించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఈ లోపాలను హ్యాకర్లు దుర్వినియోగం చేస్తే వ్యక్తిగత సమాచారం, సున్నితమైన డేటాకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.
Details
ఈ రెండు యాప్స్‌నే టార్గెట్‌గా
టాటా కార్ల కోసం ఉపయోగించే iRA 2.0, iRA.ev యాప్స్‌లో ఈ సమస్యలు గుర్తించినట్లు CERT-In తెలిపింది.
పెట్రోల్, డీజిల్ వాహనాలకు iRA 2.0, ఎలక్ట్రిక్ కార్లకు iRA.ev ఉపయోగిస్తున్నారు. iRA 2.0లో 26.73 కంటే తక్కువ వెర్షన్లు, iRA.evలో 26.72 కంటే తక్కువ వెర్షన్లలో భద్రతా లోపాలు ఉన్నట్లు హెచ్చరిక వచ్చింది.
కాబట్టి యూజర్లు తమ ఫోన్‌లో ఉన్న యాప్ వెర్షన్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలి.
Details
ఫోన్ నుంచి కారు వరకు ప్రమాదం
ఈ యాప్స్ సాధారణంగా కారును ఫోన్ నుంచే పర్యవేక్షించేందుకు ఉపయోగపడతాయి.
లైవ్ లొకేషన్, వెహికల్ హెల్త్, ట్రిప్ వివరాలు, ఫ్యూయల్ లేదా బ్యాటరీ స్టేటస్ చూడటంతో పాటు కొన్ని రిమోట్ కమాండ్స్ కూడా ఇవ్వొచ్చు.
ఇలాంటి యాప్స్‌లో భద్రతా లోపం ఉంటే హ్యాకర్లు యూజర్ డేటాను యాక్సెస్ చేయడం లేదా అప్లికేషన్ సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేయవచ్చు.
అందుకే యాప్‌ను అప్‌డేట్ చేయడం చిన్న విషయం కాదు.. అది తప్పనిసరి భద్రతా చర్యగా చూడాలి.
Details
అప్‌డేట్ చేసుకోవడమే తొలి రక్షణ
కనెక్టెడ్ కార్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాటికి సంబంధించిన సైబర్ ముప్పులు కూడా పెరుగుతున్నాయి.
గతంలో ఇతర వాహనాల రిమోట్ యాక్సెస్‌పై కూడా భద్రతా పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పుడు కారు కొనడం మాత్రమే కాదు.. దానికి అనుసంధానమైన యాప్, ఫోన్, సాఫ్ట్‌వేర్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
టాటా యూజర్లు తమ iRA యాప్స్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.
అనుమానాస్పద లింకులు, తెలియని యాప్‌లు, షేర్ చేసిన లాగిన్ వివరాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.