
Uber: 'ఉబర్ ఎలక్ట్రిక్ ' ప్రారంభం.. డ్రైవర్స్‌కు $4,000 ప్రోత్సాహకం
ఈ వార్తాకథనం ఏంటి
ఉబర్ తన "Uber Green" సర్వీస్‌ను "Uber Electric"గా మార్చి, కొత్తగా "Go Electric" అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ప్రోగ్రామ్‌లో అర్హత ఉన్న డ్రైవర్స్‌కు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి 4,000 డాలర్ల ప్రోత్సాహకంతో సహాయం ఉంటుంది. కేలిఫోర్నియా,న్యూ యార్క్,కొలోరాడో,మసాచుసెట్స్ వంటి రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. "Go Electric" గ్రాంట్‌ను ఇతర రాష్ట్ర స్థాయి డిస్కౌంట్లు, రాయితీలతో కలిపి వాడవచ్చు,దీని వల్ల కొత్త లేదా యూజ్డ్ EVs ధర వేలల్లో తగ్గవచ్చు. ఇదే సమయంలో, కొత్త ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వపు 7,500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్ ఇప్పటికే ముగియడం వల్ల వినియోగదారులకు EVs కొంచెం ఖరీదైనవి అయ్యాయి.
వివరాలు
ఉబర్ రైడర్స్‌కు 20% డిస్కౌంట్
ఉబర్ ఇప్పటికే USలో Uber Green సర్వీస్‌ను పూర్తి ఎలక్ట్రిక్ మోడల్‌గా మార్చింది. గ్లోబల్‌గా 2,00,000కి పైగా EVs ఉబర్ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్నాయి, US, కెనడా, యూరప్‌లో డ్రైవర్స్ సాధారణ కారు యజమానుల కంటే 5 రెట్లు వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుంటున్నారు. రీబ్రాండింగ్ సందర్బంగా ఉబర్ రైడర్స్ కోసం తదుపరి ఎలక్ట్రిక్ ట్రిప్‌పై 20% రాయితీ అందిస్తోంది. అలాగే, డ్రైవర్స్‌లో "రేంజ్ ఆంక్ష" తగ్గించడానికి బ్యాటరీ-అవేర్ మ్యాచ్ ఫీచర్‌ను 25 దేశాల్లో విస్తరిస్తోంది.