Bank Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. నేటి నుంచి యథావిధిగా కార్యకలాపాలు
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. దీంతో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఆదివారం రాత్రి ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రకటించింది. కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఐదు రోజుల పని దినాల అంశంపై రెండు సంఘాలకు చెందిన ప్రతినిధులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ఇందులో బ్యాంకు ఖాతాదారులు, వినియోగదారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
పీఎల్‌ఐ పథకం
పీఎల్‌ఐ పథకంలో మార్పులపై చర్చలు
స్కేల్-4, అంతకంటే పైస్థాయి అధికారులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకంలో మార్పులు తీసుకురావడంపై కూడా చర్చలు జరగనున్నాయి.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి పంపే అంశంపై ఐబీఏతో చర్చించేందుకు నిర్ణయించారు.
మిగిలిన సమస్యలు, డిమాండ్లపైనా వీలైనంత త్వరగా చర్చలు నిర్వహించనున్నట్లు ఇరువర్గాలు అంగీకరించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
Bank strike deferred after the meeting between the Indian Banks' Association (IBA) and the United Forum of Bank Unions (UFBU) tonight. pic.twitter.com/SPJUwp63p2
— ANI (@ANI) September 27, 2026