Loading...
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు షాక్‌.. డిసెంబర్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు!
ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు షాక్‌.. డిసెంబర్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారులకు షాక్‌.. డిసెంబర్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2026
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ (ICICI Bank) ఖాతాదారులకు కీలక అప్‌డేట్‌. 2026 డిసెంబర్‌ 1 నుంచి కొన్ని రకాల సేవింగ్స్‌ ఖాతాలపై సర్వీస్‌ ఛార్జీలను సవరించనుంది. ఈ మార్పులతో బ్రాంచ్‌లలో నగదు డిపాజిట్‌ చేయడం, విత్‌డ్రా చేసుకోవడం వంటి లావాదేవీల ఖర్చులు పెరగనున్నాయి. అలాగే విఫలమైన ఎలక్ట్రానిక్‌ డెబిట్‌ చెల్లింపులకు సంబంధించిన పెనాల్టీలపైనా మార్పులు ఉండనున్నాయి. తరచుగా బ్యాంకు బ్రాంచ్‌లలో నగదు లావాదేవీలు నిర్వహించేవారు, ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా చెల్లింపులు చేసేవారు కొత్త ఛార్జీల వివరాలను తెలుసుకోవడం మంచిది.

వివరాలు

నగదు డిపాజిట్‌, విత్‌డ్రాపై పెరగనున్న ఛార్జీలు

బ్యాంకు సవరించిన ఛార్జీల ప్రకారం, వర్తించే సేవింగ్స్‌ ఖాతాల్లో నెలవారీ నగదు లావాదేవీల విలువ పరిమితి దాటినప్పుడు ప్రతి రూ.1,000కు ప్రస్తుతం ఉన్న రూ.3.50 ఛార్జీని రూ.4కు పెంచనున్నారు.

బ్యాంకు బ్రాంచ్‌లలో నగదు డిపాజిట్‌ చేయడంతో పాటు, క్యాష్‌ రీసైక్లర్‌ మెషీన్ల ద్వారా చేసే నగదు డిపాజిట్లకు కూడా ఈ మార్పు వర్తిస్తుంది.

బ్రాంచ్‌లలో నగదు విత్‌డ్రా చేసుకున్నా ఇదే విధమైన ఛార్జీ వర్తించనుంది.

వివరాలు

నెలకు మూడు లావాదేవీలే ఉచితం

ఖాతాదారులు ప్రతి నెలా మూడు నగదు లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటిన తర్వాత ప్రతి అదనపు నగదు లావాదేవీకి రూ.150 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

అదే సమయంలో, నెలకు రూ.1 లక్ష వరకు నగదు లావాదేవీలు విలువ ఆధారిత ఛార్జీ లేకుండా చేసుకోవచ్చు.

ఈ పరిమితిని దాటినప్పుడు ప్రతి రూ.1,000కు రూ.4 లేదా రూ.150.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని ఛార్జీగా వసూలు చేస్తారు. అయితే ఈ కొత్త ఛార్జీలు కొన్ని రకాల సేవింగ్స్‌ ఖాతాలకు మాత్రమే వర్తిస్తాయి.

కాబట్టి ఖాతాదారులు తమ ఖాతా రకానికి వర్తించే నిబంధనలను, సవరించిన ఛార్జీల వివరాలను బ్యాంకు అధికారిక ప్రకటనలో పరిశీలించాలి.

ADVERTISEMENT