Page Loader
Tim Cook: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం భారీగా పెంపు.. ఎంతంటే
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం భారీగా పెంపు.. ఎంతంటే

Tim Cook: యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం భారీగా పెంపు.. ఎంతంటే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2025
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ దిగ్గజం ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వార్షిక వేతనాన్ని 18శాతం పెంచేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆయనకు 74.6 మిలియన్‌ డాలర్ల వేతనం ఇవ్వనున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో వెల్లడించింది. ఈ నిర్ణయం 2024 ఫిబ్రవరి 25న చేపట్టే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు వెల్లడించినట్లు పేర్కొంది. ఈ సమావేశంలో కుక్‌ జీతంతో పాటు పలు ప్రతిపాదనల్ని వాటాదారుల ముందుంచనున్నారు, అక్కడ ఓటింగ్‌ జరగనుంది.

Details

18శాతం పెంపు

2024 సంవత్సరానికి గాను టిమ్‌ కుక్‌ జీతం మొత్తం 74.6 మిలియన్‌ డాలర్లు (రూ.643 కోట్లు), ఇందులో 3 మిలియన్‌ డాలర్ల బేసిక్‌ పే, 58.1 మిలియన్‌ డాలర్ల స్టాక్‌ అవార్డులు, 13.5 మిలియన్‌ డాలర్ల అదనపు పరిహారం ఉంటాయి. 2023లో అతను అందుకున్న 63.2 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఈ మొత్తం 18శాతం పెరిగింది. అయితే 2022లో కుక్‌ పొందిన మొత్తం జీతంతో పోల్చితే 2024 వేతనం చాలా తక్కువగా ఉంది. 2023లో ఉద్యోగులు, వాటాదారుల నుంచి వేతనాలకు సంబంధించి యాపిల్‌కు ఒత్తిడి ఎదురైంది. దీంతో టిమ్‌ కుక్‌ స్వయంగా తన వేతనాన్ని తగ్గించుకోవాలని కోరారు.