NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Bank Of Baroda: బ్యాంక్‌ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్‌..అధిక వడ్డీ రేట్లతో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం  
    తదుపరి వార్తా కథనం
    Bank Of Baroda: బ్యాంక్‌ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్‌..అధిక వడ్డీ రేట్లతో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం  
    బ్యాంక్‌ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్‌..అధిక వడ్డీ రేట్లతో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం

    Bank Of Baroda: బ్యాంక్‌ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్‌..అధిక వడ్డీ రేట్లతో కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 15, 2024
    02:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంక్‌లలో ఒకటి. ఈ మధ్యనే బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది, కొన్ని ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం చేసింది.

    అలాగే, కస్టమర్ల కోసం ఒక కొత్త డిపాజిట్ ఆప్షన్‌ను ప్రారంభించింది. ఈ పథకాన్ని "బీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్" పేరిట ప్రవేశపెట్టింది.

    ఈ స్కీమ్‌లో కస్టమర్లకు మరింత అధిక వడ్డీ లభిస్తుంది. సాధారణ డిపాజిట్లతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తుంది,

    అలాగే ఈ ప్రత్యేక పథకంలో కూడా మరింత అధిక వడ్డీ ఇవ్వబడుతుంది. అందుకే, ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

    వివరాలు 

    5 లక్షలపై 400 రోజుల్లో ఎంతొస్తుంది?

    ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా 400 రోజుల టెన్యూర్‌తో ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది.

    ఈ పథకం కింద 400 రోజుల టెన్యూర్‌కు సాధారణ కస్టమర్లకు 7.30% వడ్డీ రేటు, సీనియర్ సిటిజెన్లకు 7.80% వడ్డీ రేటు (అదనంగా 50 బేసిస్ పాయింట్లు), సూపర్ సీనియర్ సిటిజెన్లకు 7.90% వడ్డీ రేటు లభిస్తోంది.

    అయితే, రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే,400 రోజుల టెన్యూర్‌కు ఎవరికి ఎంత రాబడి వస్తుందో చూద్దాం.

    సాధారణ కస్టమర్లకు 7.30% వడ్డీ రేటుతో,రూ. 40,079 వడ్డీ లభిస్తుంది,మొత్తం రూ. 5,40,079 అందుతుంది.

    అదే సీనియర్ సిటిజెన్లకు 7.80% వడ్డీ రేటుతో రూ.42,820 వడ్డీ వస్తుంది.సూపర్ సీనియర్ సిటిజెన్లకు 7.90% వడ్డీ రేటుతో రూ. 43,376 వడ్డీ లభిస్తుంది.

    వివరాలు 

    సాధారణ ప్రజలకు వడ్డీ రేట్లు

    ఇప్పుడు, బ్యాంక్ ఇటీవల వడ్డీ రేట్లు సవరించిన నేపథ్యంలో, వివిధ టెన్యూర్‌ల డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

    సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తుంది, సూపర్ సీనియర్ సిటిజెన్లకు వీరి కంటే 10 బేసిస్ పాయింట్లు అదనంగా వస్తుంది.

    సాధారణ ప్రజలకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:

    7-14 రోజుల డిపాజిట్లపై వడ్డీ రేటు 4.25%

    15-45 రోజులపై 4.50%

    46-90 రోజులపై 5.50%

    ఒక సంవత్సరానికి 6.85%

    రెండు సంవత్సరాల వరకు 7%

    రెండు నుండి మూడు సంవత్సరాల టెన్యూర్‌పై 7.15%

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025