Loading...
Bank Strike: బ్యాంకు సమ్మె ఎఫెక్ట్‌.. ఆదివారం బ్యాంకులు తెరిచేలా కేంద్రం కీలక నిర్ణయం
బ్యాంకు సమ్మె ఎఫెక్ట్‌.. ఆదివారం బ్యాంకులు తెరిచేలా కేంద్రం కీలక నిర్ణయం

Bank Strike: బ్యాంకు సమ్మె ఎఫెక్ట్‌.. ఆదివారం బ్యాంకులు తెరిచేలా కేంద్రం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు సేవల్లో అంతరాయం తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా సెలవు రోజైన ఆదివారం బ్యాంకు శాఖలను తెరిచి కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో ఈ నెల 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేయనున్నాయి.

వివరాలు 

మూడు రోజుల సమ్మె..

బ్యాంకు యూనియన్లు ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి.

28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు విధులకు దూరంగా ఉండనున్నారు.

ఈ తేదీలకు ముందు నాలుగో శనివారం, ఆదివారం సెలవులు ఉండటంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖల్లో సాధారణ సేవలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది.

దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంచాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది.

ఇందుకు ఆర్‌బీఐ కూడా ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.

వివరాలు 

అందుకే ఉద్యోగుల సమ్మె..

వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు.

2024 మార్చిలో కుదిరిన ఒప్పందం ప్రకారం వారానికి ఐదు రోజులే పని చేయడంతో పాటు, రోజుకు 40 నిమిషాలు అదనంగా విధులు నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి.

అయితే ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆమోదం లభించలేదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.

దీంతో పాటు స్కేల్‌-4, అంతకంటే పై స్థాయి అధికారులకు మాత్రమే వర్తించేలా పర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (PLI) పథకాన్ని అమలు చేయడంపైనా ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ అంశాలపై ప్రభుత్వం, బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

డిజిటల్‌ సేవలు కొనసాగుతాయి..

సమ్మె ప్రభావంతో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎస్‌బీఐతో పాటు 12 ప్రభుత్వరంగ బ్యాంకులు ముందస్తు సూచనలు జారీ చేశాయి.

శాఖలకు వెళ్లి నేరుగా చేసుకునే కొన్ని బ్యాంకింగ్‌ పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు సాధారణంగానే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశాయి.

యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లు, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ, డిజిటల్‌ బదిలీలు వంటి సేవలు కొనసాగుతాయి.

బిల్లుల చెల్లింపులు, చిన్న మొత్తాల నగదు బదిలీలు, ఇతర సాధారణ లావాదేవీల కోసం డిజిటల్‌ మార్గాలను వినియోగించుకోవాలని బ్యాంకులు ఖాతాదారులకు సూచించాయి.

ADVERTISEMENT