LOADING...
Home Loan Interest Rates: రూ.75 లక్షల వరకు గృహ రుణాలు.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?
రూ.75 లక్షల వరకు గృహ రుణాలు.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?

Home Loan Interest Rates: రూ.75 లక్షల వరకు గృహ రుణాలు.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ ప్రభావంతో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ద్రవ్యోల్బణం పెరుగుతున్నా.. ఈసారి రెపో రేట్లను పెంచకుండా యథాతథంగా ఉంచింది. దీంతో ప్రస్తుతం లోన్లు తీసుకునే వారికి వడ్డీ భారం పెరగలేదు. గతంలో వడ్డీ రేట్లు తగ్గడంతో గృహ రుణాలు చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరాయి. ఇక ప్రస్తుతం టాప్ బ్యాంకుల్లో హోం లోన్ వడ్డీ రేట్లు చూస్తే, ఎస్బీఐలో 7.25% నుంచి 8.70% వరకు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 7.20% నుంచి 9% వరకు, యూనియన్ బ్యాంక్‌లో 7.15% నుంచి 9.50% వరకు ఉన్నాయి.

వివరాలు 

యుద్ధ పరిస్థితులు అలాగే కొనసాగితే.. త్వరలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం 

పీఎన్‌బీలో రూ.75 లక్షల వరకు రుణంపై 7.20% నుంచి 9% వరకు వడ్డీ ఉంది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐలో 7.45% నుంచి, హెచ్‌డీఎఫ్‌సీలో 7.75% నుంచి, యాక్సిస్ బ్యాంకులో 8% నుంచి 11.90% వరకు ఉన్నాయి. ఇక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌లలో 7.15% నుంచే రేట్లు ప్రారంభమవుతుండగా, టాటా క్యాపిటల్‌లో 7.50% నుంచి ఉన్నాయి. అయితే యుద్ధ పరిస్థితులు అలాగే కొనసాగితే త్వరలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement