Loading...
LPG Cylinder Prices: వాణిజ్య సిలిండర్లపై మరోసారి ధరల వాత.. గృహ వినియోగదారులకు రిలీఫ్
వాణిజ్య సిలిండర్లపై మరోసారి ధరల వాత.. గృహ వినియోగదారులకు రిలీఫ్

LPG Cylinder Prices: వాణిజ్య సిలిండర్లపై మరోసారి ధరల వాత.. గృహ వినియోగదారులకు రిలీఫ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాకిచ్చాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మరోసారి పెంచాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థల నిర్వహణ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇళ్లలో వంట అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. దీంతో సామాన్య కుటుంబాలకు ప్రస్తుతానికి ఊరట లభించింది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో ఇలా..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్‌) వెల్లడించిన తాజా ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.9.50 పెరిగింది.

దీంతో అక్కడ కొత్త ధర రూ.2,747.50కు చేరింది. ముంబైలోనూ ఇదే స్థాయిలో రూ.9.50 పెంపు నమోదైంది.

దీంతో గతంలో రూ.2,691.50గా ఉన్న ధర ఇప్పుడు రూ.2,701కు చేరుకుంది.

హైదరాబాద్‌లో మాత్రం కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.11 పెరిగింది. దీంతో 19 కిలోల సిలిండర్ ధర రూ.2,996కు చేరుకుంది.

అంటే రూ.3,000కు కేవలం రూ.4 దూరంలో ఉంది. చెన్నైలో రూ.10.50 పెరగడంతో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,916.50కు చేరింది.

వివరాలు 

ఆగస్టులో స్వల్పంగా తగ్గించి..

గత ఆగస్టు నెలలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గించాయి.

అయితే సెప్టెంబర్ ప్రారంభంలోనే మళ్లీ ధరలను పెంచడం గమనార్హం. తాజా పెంపుతో వంట గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించే వ్యాపారాలపై అదనపు ఖర్చు పడనుంది.

ADVERTISEMENT

వివరాలు 

గృహ సిలిండర్ ధరల్లో మార్పులేదు

కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగినప్పటికీ.. గృహ వినియోగదారులకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మాత్రం ఆయిల్ కంపెనీలు యథాతథంగా కొనసాగించాయి.

దీంతో కోట్లాది కుటుంబాలకు తక్షణ ఉపశమనం లభించినట్లయింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.994గా ఉంది.

ఢిల్లీలో రూ.942, ముంబైలో రూ.941.50 వద్ద కొనసాగుతోంది. ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇంటి వంట గ్యాస్ కోసం ఖర్చు చేసే కుటుంబాలపై అదనపు భారం పడలేదు.

మొత్తంగా చూస్తే.. సెప్టెంబర్‌లో వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు ధరల పెంపు రూపంలో భారం పెరగగా, గృహ వినియోగదారులకు మాత్రం పాత ధరలే కొనసాగిస్తూ ఊరట కల్పించారు.

ADVERTISEMENT