Crude oil price: అంతర్జాతీయ మార్కెట్‌లో 6 నెలల కనిష్ఠానికి క్రూడాయిల్..ఈ కంపెనీల స్టాక్స్ లో జోష్
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఏప్రిల్ నుంచి చమురు ఉత్పత్తిని పెంచనున్నట్లు ఒపెక్ ప్లస్ దేశాలు ప్రకటించడంతో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70 డాలర్లకు దిగువకు చేరింది.
ఇది గత ఆరు నెలల కనిష్ఠ స్థాయికి సమానం. ఈ పరిణామం ఇన్వెస్టర్ల మనోభావాలను బలపరిచింది.
ముడి చమురు ధరలు తగ్గితే, చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే మనదేశానికి ప్రయోజనం కలుగుతుంది.
అదనంగా, ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు కూడా లాభం ఉంటుంది. వీటి మార్జిన్లు పెరగడం వల్ల ఆయా స్టాక్స్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి.
లితంగా, ఏవియేషన్, పెయింట్స్, టైర్ కంపెనీల షేర్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
ఐలాండ్ ధరల ప్రభావం - స్టాక్ మార్కెట్ ట్రెండ్
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ షేరు విలువ 4.85% పెరిగి,బీఎస్‌ఈలో రూ.342 వద్ద కొనసాగుతోంది.
ఇండియన్ ఆయిల్ 3.68% లాభపడగా,భారత్ పెట్రోలియం 3.24% పెరిగింది.
విమానయాన రంగం కూడా లాభాల్లో ఉంది. స్పైస్‌జెట్ 3.9% పెరిగింది, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) షేరు 1.74% మేర లాభపడింది.
ముడి చమురును వినియోగించే పెయింట్ కంపెనీల షేర్లు కూడా మంచి పెరుగుదల కనబరుస్తున్నాయి.
బెర్జర్ 3.05%, ఏషియన్ పెయింట్స్ 2.84%, ఇండిగో పెయింట్స్ 3.15%, నెరోల్యాక్ 1.73% పెరిగాయి.
టైర్ కంపెనీలు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. అపోలో టైర్స్ 4.38%, సియట్ 3.88%, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 2.31%, ఎంఆర్‌ఎఫ్ 1.91%, జేకే టైర్ ఇండస్ట్రీస్ 1.61% మేర లాభాల్లో ఉన్నాయి.
వివరాలు
ఒపెక్ ప్లస్ నిర్ణయం.. వాణిజ్య యుద్ధ ప్రభావం
ఏప్రిల్ నుంచి క్రూడాయిల్ ఉత్పత్తిని పెంచుతామని ఒపెక్ ప్లస్ దేశాలు పేర్కొన్నాయి.
దీనికితోడు, వాణిజ్య యుద్ధ భయాలు కూడా ముడి చమురు డిమాండ్ తగ్గుతుందన్న అనుమానాలను పెంచాయి.
ముఖ్యంగా, అమెరికా ఉత్పత్తులపై చైనా, కెనడా ప్రతిగా సుంకాలు విధిస్తామని ప్రకటించడంతో, మార్కెట్ లో అస్థిరత పెరిగింది.
అయితే, చైనా తయారీ పీఎంఐ డేటా బలహీనంగా ఉండడం, డాలర్ ఇండెక్స్ 5 నెలల కనిష్ఠ స్థాయికి చేరడంతో, ముడి చమురు కనిష్ఠ స్థాయిల వద్ద మద్దతు పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.