Loading...
EPFO: ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్‌ డీటెయిల్స్‌...ఇలా చెక్‌ చేసుకోండి
ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్‌ డీటెయిల్స్‌...ఇలా చెక్‌ చేసుకోండి

EPFO: ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్‌ డీటెయిల్స్‌...ఇలా చెక్‌ చేసుకోండి

వ్రాసిన వారు Balachander Sharma
Nov 02, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగులు తమ పీఎఫ్‌ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలంటే ఇకపై వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్‌ కావాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌, వాట్సాప్‌ ఉంటే చాలు.. PF బ్యాలెన్స్‌తో పాటు చివరి ఐదు లావాదేవీలు, పాస్‌బుక్‌ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఉద్యోగులకు డిజిటల్‌ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నవంబర్‌ 1, 2026న ఢిల్లీలో జరిగిన సంస్థ 74వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ దీనిని ప్రారంభించారు.

Details

వాట్సాప్‌లో పీఎఫ్‌ వివరాలు ఎలా తెలుసుకోవాలి?

ఈ సేవను ఉపయోగించుకోవడానికి ముందుగా 87964 41800 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి.

ఆ తర్వాత EPFOలో రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబర్‌ నుంచే ఈ వాట్సాప్‌ నంబర్‌కు 'Hi' అని మెసేజ్‌ పంపాలి. వెంటనే మీకు భాషను ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది.

అనంతరం స్క్రీన్‌పై వచ్చే ఆప్షన్లలో మీకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవచ్చు. PF బ్యాలెన్స్‌ తెలుసుకోవాలంటే సంబంధిత ఆప్షన్‌ను ఎంచుకుని సూచనలు పాటించాలి.

Details

ఉద్యోగి వాటా, కంపెనీ వాటా కూడా తెలుసుకోవచ్చు

బ్యాలెన్స్‌ వివరాల కోసం ఆప్షన్‌ ఎంచుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని అధికారిక వెరిఫైడ్‌ EPFO వాట్సాప్‌ చాట్‌లో నమోదు చేస్తే ఖాతా వివరాలు కనిపిస్తాయి.

ఇందులో ఉద్యోగి జమ చేసిన మొత్తం, యజమాని వాటా, పెన్షన్‌కు సంబంధించిన మొత్తం, చివరి లావాదేవీ వివరాలను పరిశీలించవచ్చు.

అంతేకాదు, ఇటీవల జరిగిన ఐదు లావాదేవీల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌ మెనూలో Passbook ఆప్షన్‌ ఎంచుకుంటే పీఎఫ్‌ పాస్‌బుక్‌ వివరాలను పొందవచ్చు.

అందుబాటులో ఉన్న సూచనల ప్రకారం, OTP వెరిఫికేషన్‌ తర్వాత పాస్‌బుక్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

Details

నకిలీ నంబర్ల విషయంలో జాగ్రత్త!

ఈ సదుపాయం ఉపయోగకరమైనదే అయినా, భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. EPFO అధికారికంగా ధృవీకరించిన వాట్సాప్‌ ఖాతాతోనే సంభాషిస్తున్నామో చూసుకోవాలి.

OTPని ఇతర వ్యక్తులకు, అనుమానాస్పద నంబర్లకు పంపకూడదు. UAN పాస్‌వర్డ్‌, ఆధార్‌ వివరాలు, బ్యాంక్‌ ఖాతా సమాచారం కూడా ఎవరికీ వెల్లడించకూడదు.

కొత్త వాట్సాప్‌ సేవతో సాధారణ పీఎఫ్‌ వివరాలు తెలుసుకోవడం సులభమవుతుంది.

అయితే క్లెయిమ్‌లు, విత్‌డ్రాయల్‌ వంటి ఇతర లావాదేవీల కోసం EPFO అధికారిక పోర్టల్‌ లేదా UMANG యాప్‌ సేవలను ఉపయోగించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT