Gold & Silver Rates: పశ్చిమాసియా ఉద్రిక్తతలు..మళ్లీ పెరుగుతున్న బంగారం,వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాల నేపథ్యంలో కమోడిటీ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఇటీవల గణనీయంగా పడిపోయిన బంగారం,వెండి ధరలు ఇప్పుడు మళ్లీ పైకి పెరుగుతున్నాయి. నేటి ధరలు ఇలా... గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, మార్చి 26 ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా నమోదయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,680గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,460గా ఉంది. ఇక వెండి ధర కూడా పెరిగి కిలోకు రూ.2,60,100కి చేరింది.
వివరాలు
నిన్న భారీ పెరుగుదల
భారత్‌లో నిన్న బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,760 మేర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,450 వరకు ఎగబాకింది. వెండి ధర అయితే ఒక్కరోజులోనే రూ.15,000 వరకు పెరగడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి
అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) స్వచ్ఛమైన బంగారం ధర 4,535 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర ఔన్స్‌కు 71 డాలర్లుగా ఉంది.
వివరాలు
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు, 22 క్యారెట్లు) ధరలు:
చెన్నై: ₹1,48,380; ₹1,36,010;
ముంబై: ₹1,46,680; ₹1,34,460;
న్యూఢిల్లీ: ₹1,46,830; ₹1,34,610;
కోల్‌కతా: ₹1,46,680; ₹1,34,460;
బెంగళూరు: ₹1,46,680; ₹1,34,460;
హైదరాబాద్: ₹1,46,680; ₹1,34,460;
విజయవాడ: ₹1,46,680; ₹1,34,460;
కేరళ: ₹1,46,680; ₹1,34,460;
పుణె: ₹1,46,680; ₹1,34,460;
వడోదరా: ₹1,46,730; ₹1,34,510;
అహ్మదాబాద్: ₹1,46,730; ₹1,34,510;
వివరాలు
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹2,60,100;
ముంబై: ₹2,50,100;
న్యూఢిల్లీ: ₹2,50,100;
కోల్‌కతా: ₹2,50,100;
బెంగళూరు: ₹2,50,100;
హైదరాబాద్: ₹2,60,100;
విజయవాడ: ₹2,60,100;
కేరళ: ₹2,60,100;
పుణె: ₹2,50,100;
వడోదరా: ₹2,50,100;
అహ్మదాబాద్: ₹2,50,100;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.