Gold & Silver Rates: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరలు గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ ట్రెండ్‌కు బ్రేక్ పడుతూ, ఈ రోజు బుధవారం మార్కెట్‌లో ఒక్కసారిగా ధరలు భారీగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, మార్చి 25 ఉదయం 7 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గణనీయంగా ఎగబాకాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,900కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,990గా నమోదైంది. అలాగే వెండి ధర కూడా పెరిగి, కిలోకు రూ.2,49,900గా ఉంది.
వివరాలు
వెండి ధర కిలోకు..
ఇదే సమయంలో, నిన్న మంగళవారం ఉదయం పరిస్థితిని పరిశీలిస్తే, బంగారం,వెండి ధరలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి.
ఆ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,340గా నమోదైంది.
వెండి ధర కూడా కిలోకు రూ.2,29,900గా ఉంది. మొత్తానికి, ఒక్క రోజులోనే బంగారం,వెండి ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపించడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
దేశంలో ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు, 22 క్యారెట్లు) ధరలు ఇవీ..
చెన్నై: రూ 1,44,550, రూ.1,32,490
ముంబై: రూ.1,42,900, రూ.1,30,990
న్యూఢిల్లీ: రూ.1,43,050, రూ.1,31,140
కోల్‌కతా: రూ.1,42,900, రూ. 1,30,990
బెంగళూరు: రూ.1,42,900, రూ.1,30,990
హైదరాబాద్: రూ.1,42,900, రూ.1,30,990
విజయవాడ: రూ1,42,900, రూ.1,30,990
కేరళ: రూ.1,42,900, రూ.1,30,990
పుణె: రూ1,42,900, రూ.1,30,990
వడోదరా: రూ.1,42,950; రూ.1,31,040
అహ్మదాబాద్: రూ.1,42,950, రూ.1,31,040
వివరాలు
కిలో వెండి ధరలు ఇలా..
చెన్నై: రూ.2,49,900
ముంబై: రూ.2,35,100
న్యూఢిల్లీ: రూ.2,35,100
కోల్‌కతా: రూ.2,35,100
బెంగళూరు: రూ.2,35,100
హైదరాబాద్: రూ.2,49,900
విజయవాడ: రూ.2,49,900
కేరళ: రూ.2,49,900
పుణె: రూ.2,35,100
వడోదరా: రూ.2,35,100
అహ్మదాబాద్: రూ.2,35,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.