Gold & Silver: భారీగా పతనమైన బంగారం,వెండి ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయి? ఎంత వరకు తగ్గాయి?
ఈ వార్తాకథనం ఏంటి
మంగళవారం, బుధవారం వరుసగా పెరిగిన బంగారం,వెండి ధరలు గురువారం ఒక్కసారిగా దిశ మార్చుకున్నాయి. భారీగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. గత రెండు రోజులుగా ఎగబాకిన ధరల్లో ఇప్పుడు లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఈ రెండు విలువైన లోహాల రేట్లు మళ్లీ దిగువ స్థాయిలకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,54,420గా నమోదైంది. ఇది నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.5,020 తగ్గినట్టే. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,41,550కి చేరింది.
వివరాలు
కిలో వెండి ధర మళ్లీ రూ.3 లక్షల స్థాయికి..
నిన్నటి ధరతో పోల్చితే ఇది రూ.4,600 తగ్గుదల. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,54,570గా ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.1,41,700గా నమోదైంది . వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. మంగళ, బుధవారాల్లో భారీ ఎత్తుకు చేరిన వెండి గురువారం ఊహించని విధంగా తగ్గి షాక్ ఇచ్చింది. కిలో వెండి ధర మళ్లీ రూ.3 లక్షల స్థాయికి దిగివచ్చింది. నిన్నటితో పోలిస్తే కిలోపై సుమారు రూ.20 వేల మేర తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉండగా, ఢిల్లీలో కూడా ఇదే స్థాయిలో కొనసాగుతోంది.