Gold Rates: తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. ఈరోజు మార్కెట్ రేట్లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగాయి.ఇతర అవసర వస్తువుల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు కూడా ఒత్తిడికి లోనవుతూ కుదేలవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బంగారం,వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పడటం గమనార్హం. గత వారం భారీగా తగ్గిన ధరలు ఈ వారం కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం,వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. తులం బంగారం ధరపై రూ.1,960 తగ్గగా,వెండి ధర కిలోకు రూ.5,000 తగ్గింది. తులం బంగారం ధరలో రూ.1,960 తగ్గుదలతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680 వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
ఊరట ఇచ్చిన వెండి ధర
అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 తగ్గి రూ.1,48,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,470 తగ్గడంతో అది రూ.1,21,260 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా ఈరోజు కొనుగోలుదారులకు కొంత ఊరట ఇచ్చింది. కిలో వెండి ధరపై రూ.5,000 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. అయితే హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.