Gold and silver rates : మరోసారి తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఒక్కసారిగా ఎంత తగ్గాయంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
గత నాలుగు-ఐదు రోజులుగా బంగారం,వెండి ధరలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్న బంగారం,వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి. ప్రతిరోజూ తగ్గుతూనే ఉన్నాయి.మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 6:30 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,160గా నమోదయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,390కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,310గా,22 క్యారెట్లది రూ.1,40,540గా నమోదైంది. ఇక వెండి మార్కెట్ పరిస్థితి కూడా తారుమారమవుతోంది.
వివరాలు
3 లక్షల దిగువకు వెండి
గతంలో భారీ పెరుగుదల పొందిన వెండి ఇప్పుడు స్థిరీకరణ దశలోకి చేరింది.
కిలో వెండి ధర ఒక దశలో రూ. 4.25 లక్షలకు చేరినా, కొద్ది రోజులలోనే అది రూ. 3 లక్షల దిగువకు పడిపోయింది.
ఈ నేపథ్యంలో, ఈ రోజు వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని పరిశీలిద్దాం.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1, 53, 160, రూ.1, 40, 390
విజయవాడలో రూ.1, 53, 160, రూ.1, 40, 390
ఢిల్లీలో రూ.1, 53, 310, రూ.1, 40, 540
ముంబైలో రూ.1, 53, 160, రూ.1, 40, 390
వడోదరలో రూ.1, 53, 210, రూ.1, 40, 440
కోల్‌కతాలో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
చెన్నైలో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
బెంగళూరులో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
కేరళలో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
పుణెలో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 2, 99, 900
విజయవాడలో రూ. 2, 99, 900
ఢిల్లీలో రూ. 2, 99, 900
చెన్నైలో రూ. 2, 99, 900
కోల్‌కతాలో రూ. 2, 99, 900
కేరళలో రూ. 2, 99, 900
ముంబైలో రూ. 2, 99, 900
బెంగళూరులో రూ. 2, 99, 900
వడోదరలో రూ. 2, 99, 900
అహ్మదాబాద్‌లో రూ. 2, 99, 900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.