Loading...
Gold and Silver Rates: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం,వెండి ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం,వెండి ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం,వెండి ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 30, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ఇటీవల తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో, పసిడి,వెండి రేట్లు మార్పులకు లోనవుతున్నాయి. ఈ రోజు, మార్చి 30 ఉదయం 6 గంటల సమయానికి దేశవ్యాప్తంగా బంగారం ధరలు గమనించదగ్గ స్థాయిలో ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,48,080 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,35,740 పరిధిలో ఉంది.

వివరాలు 

వెండి ధర

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు కొంచెం పెరిగినట్లే కనిపిస్తున్నాయి.

అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,48,210కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,890 వద్ద నమోదైంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే, ఇటీవల స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది.

ప్రస్తుతం వెండి ధర 2.5 లక్షల రూపాయల మార్క్ కంటే దిగువకు చేరింది.

ఇది పెట్టుబడిదారులకు ఒక ముఖ్యమైన సంకేతంగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్‌లో రూ.1,48,080, రూ.1,35,740

విజయవాడలో రూ.1,48,080, రూ.1,35,740

ఢిల్లీలో రూ.1,48,210, రూ.1,35,890

ముంబైలో రూ.1,48,080, రూ.1,35,740

వడోదరలో రూ.1,48,110, రూ.1,35,790

కోల్‌కతాలో రూ.1,48,080, రూ.1,35,740

చెన్నైలో రూ.1,49,010, రూ.1,36,590

బెంగళూరులో రూ.1,48,080, రూ.1,35,740

కేరళలో రూ.1,48,080, రూ.1,35,740

పుణెలో రూ.1,48,080, రూ.1,35,740

ADVERTISEMENT

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

హైదరాబాద్‌లో రూ.2,49,900

విజయవాడలో రూ.2,49,900

ఢిల్లీలో రూ.2,44,900

చెన్నైలో రూ.2,49,900

కోల్‌కతాలో రూ.2,44,900

కేరళలో రూ.2,49,900

ముంబైలో రూ.2,44,900

బెంగళూరులో రూ.2,44,900

వడోదరలో రూ.2,44,900

అహ్మదాబాద్‌లో రూ.2,44,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ADVERTISEMENT