Gold loan Market: గోల్డ్ లోన్ మార్కెట్ మూడేళ్లలో మూడింతలు.. రూ.22.5 లక్షల కోట్లకు చేరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక అవసరాలు ఎదురైనప్పుడు రుణం తీసుకోవడం సాధారణమే. ముఖ్యంగా ఇంట్లో బంగారం ఉంటే దాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడానికి చాలా కుటుంబాలు మొగ్గు చూపుతుంటాయి. చేతిలో బంగారం ఉండటంతో తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల కాలంలో ఈ విధంగా రుణాలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ మూడేళ్లలో దాదాపు మూడింతలైంది. 2026 ఆగస్టు నాటికి ఈ మార్కెట్ విలువ రూ.22.5 లక్షల కోట్లకు చేరింది. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నవారు మళ్లీ మళ్లీ అప్పులు చేస్తున్నారని ప్రముఖ క్రెడిట్ సమాచార సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్ తన నివేదికలో వెల్లడించింది.
వివరాలు
54 శాతం మంది ఏడాది వ్యవధిలోనే మళ్లీ గోల్డ్ లోన్
2023 జులై నుంచి 2025 జూన్ మధ్య కాలంలో రూ.2.5 లక్షల వరకు రుణం తీసుకున్న తక్కువ రిస్క్ వినియోగదారుల్లో 57 శాతం మంది 12 నెలల్లోనే మరోసారి గోల్డ్ లోన్ పొందారు.
వీరంతా 731 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోరు కలిగినవారే. అదే సమయంలో రూ.2.5 లక్షలకు పైగా రుణం తీసుకున్నవారిలో 54 శాతం మంది ఏడాది వ్యవధిలోనే మళ్లీ గోల్డ్ లోన్ తీసుకున్నట్లు నివేదిక తెలిపింది.
వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులతో పోలిస్తే బంగారం తాకట్టు రుణాలనే మళ్లీ మళ్లీ పొందేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని సిబిల్ పేర్కొంది.
వియార్లు
21 శాతం మందికి గోల్డ్ లోన్
2026 ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ల మొత్తం బకాయిలు రూ.22.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఈ విభాగంలో 5.5 కోట్ల మంది క్రియాశీల రుణగ్రహీతలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
అన్ని రకాల రుణాలు తీసుకున్నవారిలో 21 శాతం మందికి గోల్డ్ లోన్ ఉందని తెలిపింది.
అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు బంగారం తాకట్టు పెట్టి రుణం పొందుతున్నారు.
ఒక్కో రుణగ్రహీత తీసుకుంటున్న సగటు గోల్డ్ లోన్ మొత్తం రూ.4.1 లక్షలుగా ఉంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ద్వారా గోల్డ్ లోన్లు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని సిబిల్ నివేదిక పేర్కొంది.
ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బంగారం తాకట్టు పెట్టి రుణం పొందే ధోరణి అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.