Loading...
Gold Price Today: బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ రోజు తులం రేటు ఎంతంటే?
బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ రోజు తులం రేటు ఎంతంటే?

Gold Price Today: బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ రోజు తులం రేటు ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలను పెట్టుబడిదారులతో పాటు ఆభరణాల కొనుగోలుదారులు కూడా నిశితంగా గమనిస్తున్నారు. సెప్టెంబర్ 21, 2026న దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. అయితే గత రెండు,మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కూడా అదే ధోరణి కొనసాగుతోంది. భారత్‌లో బంగారం ధరలను అంతర్జాతీయ మార్కెట్‌లోని పసిడి రేట్లు,అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ,దేశీయంగా ఉన్న డిమాండ్ వంటి పలు అంశాలు ప్రభావితం చేస్తాయి. పండుగ సీజన్‌ సమీపిస్తుండటంతో ఆభరణాలకు డిమాండ్ పెరిగితే అది కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కేవలం వారం రోజుల్లోనే తులం బంగారం ధర ఏకంగా రూ.2,600వరకు పెరిగింది.

వివరాలు 

ఢిల్లీ, ముంబైలో బంగారం ధరలు

సెప్టెంబర్ 21, సోమవారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,980గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,42,990 పలుకుతోంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,830గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,840గా ఉంది.

బెంగళూరులోనూ ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,830 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,840గా ఉంది.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,830గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,42,840గా పలుకుతోంది.

విజయవాడలోనూ బంగారం ధరలు హైదరాబాద్‌తో సమానంగా ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,830 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,840గా ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

స్వల్పంగా తగ్గిన వెండి ధర

బంగారం ధరలతో పోలిస్తే వెండి రేటులో స్వల్ప తగ్గుదల నమోదైంది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం,వెండి ధరలు సెప్టెంబర్ 21, 2026న అందుబాటులో ఉన్న రిటైల్ రేట్ల ఆధారంగా ఇవ్వబడ్డాయి. నగరం, ఆభరణాల దుకాణం, పన్నులు, తయారీ ఛార్జీలను బట్టి తుది ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉండొచ్చు.

ADVERTISEMENT