LOADING...
Gold Price Today: మళ్లీ దిగివచ్చిన బంగారం,వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!
మళ్లీ దిగివచ్చిన బంగారం,వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

Gold Price Today: మళ్లీ దిగివచ్చిన బంగారం,వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి మరోసారి ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా ఈ రెండు విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా గత వారం ఇదే రోజుతో పోలిస్తే తులం బంగారం ధర రూ.5 వేలకుపైగా తగ్గడం గమనార్హం. నేడు కూడా దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,940గా నమోదైంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,940 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి కిలోకు రూ.2,39,000గా ఉంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

అయితే ఇవి ఉదయం 6 గంటలకు నమోదైన ధరలు మాత్రమే. ప్రతి రోజు ఉదయం 11గంటల సమయంలో ధరలు సవరించబడే అవకాశం ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులో ధరలు పెరగవచ్చు,తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అందువల్ల బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు ఆ రోజు తాజా ధరలను ఒకసారి తప్పనిసరిగా పరిశీలించడం మంచిది. హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,43,940 22 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,31,940 విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,43,940 22 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,31,940 ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,44,090 22 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,32,090

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు

ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,43,940 22 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,31,940 చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,45,850 22 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,33,690 బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,43,940 22 క్యారెట్ల 10 గ్రాములు - రూ.1,31,940 వెండి ధరలు హైదరాబాద్‌, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,44,900గా కొనసాగుతోంది. మిగిలిన ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2,39,900గా నమోదైంది.

Advertisement

వివరాలు 

గత కొన్ని వారాల్లో భారీ తగ్గుదల

గత కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. మే 10న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,53,140 ఉండగా, జూన్ 28 నాటికి అది సుమారు రూ.1,39,873కు పడిపోయింది. అంటే ఈ కాలంలో బంగారం ధర సుమారు రూ.13,267 మేర తగ్గింది. అదే సమయంలో వెండి ధర కూడా భారీగా దిగివచ్చింది. కిలో వెండి ధర రూ.2,62,350 నుంచి రూ.2,16,541కు చేరింది. అంటే కిలోకు సుమారు రూ.45,809 మేర తగ్గుదల నమోదైంది. ఈ స్థాయిలో ధరలు తగ్గడం పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలుదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

Advertisement