Gold Prices Fall Again: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం,వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ఇటీవల ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరిన బంగారం,వెండి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం,అంతర్జాతీయ మార్కెట్‌లో అనుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో గత నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరల్లో వరుసగా తగ్గుదల నమోదవుతోంది. గురువారం కూడా ఈ విలువైన లోహాల ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 మేర తగ్గింది.
వివరాలు
గురువారం ఉదయం తాజా బంగారం,వెండి ధరలు
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,320గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,290కు చేరుకుంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,240గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర జాతీయ మార్కెట్‌లో రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు
హైదరాబాద్: 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,320. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.1,32,290. కిలో వెండి ధర రూ.2,39,900. విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,320. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.1,32,290. కిలో వెండి ధర రూ.2,44,900. ఢిల్లీ: 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,470. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,440. కిలో వెండి ధర రూ.2,44,900. ముంబై: 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,320. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,290. కిలో వెండి ధర రూ.2,44,900.
వివరాలు
ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు
చెన్నై: 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,630. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,490. కిలో వెండి ధర రూ.2,39,900. బెంగళూరు: 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,320. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,290. కిలో వెండి ధర రూ.2,44,900.