Gold Price Today: బంగారం,వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత వరుసగా కొన్ని రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరుగుదల దిశగా పయనించాయి. ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఊరట పొందుతుండగానే బుధవారం నుంచి పరిస్థితి పూర్తిగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు వేగంగా ఎగబాకాయి. నిన్నటితో పోలిస్తే గురువారం ఒక్కరోజులోనే 24 క్యారట్ల తులం (10 గ్రాములు) బంగారం ధరపై రూ.3,450 పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా కిలోకు రూ.5,000 పెరగడంతో కొనుగోలుదారులకు మరోసారి షాక్ తగిలింది.
వివరాలు
వెండి ధర కిలో..
గురువారం ఉదయం 10 గంటల నాటికి హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,550గా నమోదైంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,500 వద్ద కొనసాగుతోంది.వెండి ధర కిలోకు రూ.2,50,000కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కూడా హైదరాబాద్‌కు సమానమైన ధరలే నమోదయ్యాయి. ఈ నగరాల్లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,550గా ఉండగా, 22 క్యారట్ల బంగారం రూ.1,32,500కు లభిస్తోంది. వెండి ధర కిలోకు రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు పూణె, బెంగళూరులో కూడా 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,550గా ఉంది. 22 క్యారట్ల బంగారం రూ.1,32,500 వద్ద విక్రయమవుతోంది.
వివరాలు
ప్రపంచ మార్కెట్‌లో చోటుచేసుకునే పరిణామాల ప్రభావం..
అయితే వెండి ధర మాత్రం హైదరాబాద్‌తో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉండి, ఈ నగరాల్లో కిలో వెండి రూ.2,45,000గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,44,700గా ఉంది. చెన్నైలో మాత్రం బంగారం ధర మరింత ఎక్కువగా నమోదై, 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం రూ.1,46,180కు చేరుకుంది. వెండి ధర విషయానికి వస్తే ఢిల్లీలో కిలో రూ.2,45,000గా ఉండగా, చెన్నైలో రూ.2,50,000గా కొనసాగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ మార్కెట్‌లో చోటుచేసుకునే పరిణామాల ప్రభావంతో బంగారం,వెండి ధరలు తరచూ మారుతూ ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా మార్కెట్ ధరలను ఒకసారి తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.