Loading...
Gold Prices Today: బంగారం కొనాలనుకునేవారికి షాక్.. దీపావళికి ముందు పెరిగిన ధరలు.. నవంబర్ 2న గోల్డ్,సిల్వర్ రేట్లు ఇవే!
నవంబర్ 2న గోల్డ్,సిల్వర్ రేట్లు ఇవే!

Gold Prices Today: బంగారం కొనాలనుకునేవారికి షాక్.. దీపావళికి ముందు పెరిగిన ధరలు.. నవంబర్ 2న గోల్డ్,సిల్వర్ రేట్లు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు ఇటీవల తగ్గుతూ వస్తున్నప్పటికీ, దీపావళికి ముందు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. పండుగ సమీపిస్తుండటంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు బంగారు దుకాణాల యజమానులు జీరో మేకింగ్ ఛార్జీలు, లక్కీ డ్రాలు వంటి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నారు. భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక సెంటిమెంట్ కూడా. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందర్భంగా పసిడి కొనుగోలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నవంబర్ 2, సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

వివరాలు 

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,370గా కొనసాగుతోంది.

సోమవారం ఒక్కరోజే ఈ ధర రూ.490 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,27,750గా ఉంది.

ఈ ధర కూడా ఒక్కరోజులో రూ.450 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

ఇతర నగరాల్లో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,520గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,900కు చేరింది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,39,370గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,750గా కొనసాగుతోంది. బెంగళూరులోనూ ఇదే ధరలు నమోదయ్యాయి.

వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.2 లక్షలుగా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్‌లోనూ కిలో వెండి ధర ఇదే స్థాయిలో కొనసాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

ఇటీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి.

అయితే,అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.

అమెరికా డాలర్ బలోపేతం కావడం,బాండ్ విలువలు పెరగడం,అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో కొందరు పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగారు.

దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా? లేక మరింత తగ్గుతాయా? అనేది ఇప్పుడే చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు.

అందువల్ల బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మార్కెట్ పరిస్థితులను పరిశీలించి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ADVERTISEMENT