LOADING...
Gold Rates: తగ్గిన గోల్డ్,సిల్వర్ ధరలు.. మహిళలకు పండగే పండగ
తగ్గిన గోల్డ్,సిల్వర్ ధరలు.. మహిళలకు పండగే పండగ

Gold Rates: తగ్గిన గోల్డ్,సిల్వర్ ధరలు.. మహిళలకు పండగే పండగ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

హమ్మయ్య.. బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్కసారిగా పెరిగిన ధరలు, ఇవాళ కాస్త స్థిరంగా మారాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగిన సమయంలో బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం కనిపించింది. అయితే బుధవారం ట్రంప్ సీజ్‌ఫైర్ ప్రకటనతో మార్కెట్ ఒక్కసారిగా ఎగిసిపడింది. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి రావడంతో ధరలు తగ్గాయి.

వివరాలు 

వెండి ధర

తులం బంగారం ధరపై రూ.2,340 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,51,480 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,150 తగ్గి రూ.1,38,850కు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,760 తగ్గి రూ.1,13,610 వద్ద ఉంది. ఇక వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.2,55,000 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్, చెన్నై నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,55,000గా కొనసాగుతోంది.

Advertisement