Page Loader
Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో బీమా కవరేజీ పెంపు.. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవైపై కేంద్రం దృష్టి!
ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో బీమా కవరేజీ పెంపు.. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవైపై కేంద్రం దృష్టి!

Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో బీమా కవరేజీ పెంపు.. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవైపై కేంద్రం దృష్టి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 22, 2025
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో బీమా కవరేజీపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎంఎస్‌బీవై కింద బీమా కవరేజీని పెంచే ప్రణాళికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిద్వారా బలహీన వర్గాలకు ఆర్థిక భద్రతను మెరుగుపరచడంతో పాటు, 2047 నాటికి 'అందరికీ బీమా' అనే లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీఎంజేజేబీవై కింద ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల జీవిత బీమా పరిమితిని రూ.5 లక్షలకు పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ఇది లబ్ధిదారులకు మెరుగైన ఆర్థికసాయం అందించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. పెరిగిన కవరేజీ వల్ల బీమా పొందిన వ్యక్తులకు, వారిపై ఆధారపడిన వారికి మరింత ఆర్థిక భద్రత కల్పించవచ్చు.

Details

 కోట్ల మంది లబ్ధిదారులు 

గత నెల వరకు పీఎంజేజేబీవై ద్వారా భారతదేశంలో 21 కోట్ల మందికి పైగా లబ్ధి పొందినట్లు నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్ 20,2024 నాటికి పథకంలో నమోదు సంఖ్య 21.6 కోట్లకు చేరింది. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.17,211.50 కోట్ల విలువైన క్లెయిమ్‌లు పరిష్కరించారు. బడ్జెట్‌లో ఈ పథకాలకు సంబంధించి కీలక మార్పులను ప్రకటించే అవకాశముందని మింట్ రిపోర్ట్ చెబుతోంది. బీమా పెంపు చర్చలు పీఎంజేజేబీవై ఒక సంవత్సర కాలం గల జీవిత బీమా పథకం కాగా, పీఎంఎస్‌బీవై ప్రమాదవశాత్తు మరణం లేదా వైకల్యాన్ని కవర్ చేసే బీమా పథకం. ఈ రెండు పథకాలను ప్రతి సంవత్సరం పునరుద్ధరిస్తారు. ప్రస్తుతం ఈ పథకాల కింద బీమా కవరేజీ పెంపుపై చర్చలు జరుగుతున్నాయి.

Details

ప్రీమియం ఖర్చు

ప్రస్తుత బీమా పథకాల్లో పీఎంఎస్‌బీవైకు సంవత్సరానికి రూ.20, పీఎంజేజేబీవైకి రూ.436 ప్రీమియంగా ఉంది. బీమా కవరేజీ పెంపునకు అనుగుణంగా కొత్త ప్రీమియం రేట్లు నిర్ణయించబడవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నందున ప్రీమియం భారీగా పెరగకపోవచ్చు.