Loading...
BSNL SIM: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్‌.. రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్
స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్‌.. రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్

BSNL SIM: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్‌.. రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. 'ఫ్రీడం 2.0 మొబైల్‌' పేరుతో కేవలం రూ.1కే సిమ్‌ను అందిస్తున్నట్లు సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం. శేషాచలం తెలిపారు. ఈ ఆఫర్‌లో రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో పాటు 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ఇతర ఆఫర్ల వివరాలను కూడా వెల్లడించారు. రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ తీసుకునే వినియోగదారులకు ప్రస్తుతం ఉన్న 365 రోజుల వ్యాలిడిటీకి అదనంగా మరో 47 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుందని చెప్పారు.

వివరాలు

గతేడాది రూ.1,089 కోట్ల ఆదాయం

అలాగే 'ఫైబర్‌ ఫ్రీడం' ప్లాన్‌ను రూ.1,111కే అందిస్తున్నట్లు తెలిపారు.

నెలకు రూ.499 చెల్లించి ఫైబర్‌ బేసిక్‌ ప్లాన్‌ తీసుకునే వినియోగదారులకు కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ గతేడాది రూ.1,089 కోట్ల ఆదాయం సాధించినట్లు శేషాచలం వెల్లడించారు.

ఇంటర్నెట్‌ లీజ్‌ లైన్‌ సేవలను తీసుకునే వినియోగదారులు నెల రోజుల పాటు సేవలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చని తెలిపారు.

వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

ADVERTISEMENT