Loading...
Andhra Pradesh: 44.20 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
44.20 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Andhra Pradesh: 44.20 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలోని 44.20 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తోంది. ఎస్‌ఐఆర్‌ నిబంధనల ప్రకారం ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్నవారు 2002 నాటి జాబితాలోని తమ పేరు, తల్లిదండ్రుల పేరు లేదా తాత, నానమ్మల పేర్లు, ఇతర వివరాలతో మ్యాచింగ్‌ చేసుకోవాల్సి ఉంది. బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ)లకు ఓటర్లు సమర్పించిన ఎన్యూమరేషన్‌ పత్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారులు.. చాలామంది తమ వివరాలను 2002 జాబితాతో మ్యాచింగ్‌ చేయకుండా వదిలేసినట్లు గుర్తించారు. మరికొందరు తప్పులు, లోపాలతో కూడిన వివరాలను మ్యాచింగ్‌ చేసినట్లు తేలింది. ఈ రెండు వర్గాలకు చెందిన ఓటర్లకు ప్రస్తుతం నోటీసులు జారీ చేస్తున్నారు.

వివరాలు

సెప్టెంబరు 28లోగా విచారణ

నోటీసులు అందుకున్న 44.20 లక్షల మంది ఓటర్లను సెప్టెంబరు 28లోగా అధికారులు విచారించనున్నారు.

విచారణ సమయంలో ఓటర్లు ఇచ్చే వివరణలు, వారు సమర్పించే ఆధార పత్రాలతో అధికారులు సంతృప్తి చెందితే.. వారి పేర్లు అక్టోబరు 3న విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితాలో కొనసాగుతాయి.

తిరుపతి, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి, పల్నాడు జిల్లాల్లోని ఓటర్లకు అత్యధికంగా నోటీసులు జారీ అయినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు

36 లక్షల మందితో తప్పిదాలతో మ్యాచింగ్

నోటీసులు జారీ చేసిన 44.20లక్షల మందిలో సుమారు 36 లక్షల మంది ఓటర్లు తమ వివరాలను తప్పులు, లోపాలతో మ్యాచింగ్‌ చేసినట్లు ఎన్నికల సంఘం గుర్తించింది.

ఈ క్రమంలో ప్రధానంగా తొమ్మిది రకాల తప్పిదాలు, లోపాలను అధికారులు గుర్తించారు. వాటిలో ముఖ్యమైనవి:

తల్లిదండ్రులు-పిల్లల వయసులో వ్యత్యాసం

తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయసు తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా లేదా 50 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండటం.

తాత, నానమ్మలతో వయసు వ్యత్యాసం

ఓటరుకు, తాత లేదా నానమ్మకు మధ్య వయసు తేడా 40 ఏళ్ల కంటే తక్కువగా ఉండటం.

తండ్రి పేరు విషయంలో తేడా

ప్రస్తుత ఓటర్ల జాబితాలోని తండ్రి పేరు, 2002 నాటి జాబితాలో ఉన్న తండ్రి పేరుతో సరిపోలకపోవడం.

ADVERTISEMENT

వివరాలు

తోబుట్టువుల వయసులో వ్యత్యాసం

ఒకే తల్లిదండ్రుల పేర్లతో అనుసంధానమైన పిల్లల మధ్య వయసు తేడా 9 నెలల కంటే తక్కువగా ఉండటం.

ఓటరు పేరులో తేడా

ప్రస్తుత జాబితాలోని ఓటరు పేరు, 2002 నాటి జాబితాలోని పేరుతో సరిపోలకపోవడం.

తల్లిదండ్రుల వివరాల్లో తప్పులు

ఓటర్లు సమర్పించిన తల్లిదండ్రుల వివరాల్లో తప్పులు ఉండటం.

ఈ తరహా లోపాలు, వివరాల్లో వ్యత్యాసాలను గుర్తించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి, వారి వివరణలు మరియు ఆధార పత్రాలను పరిశీలిస్తోంది.

ADVERTISEMENT