LOADING...
India GDP Growth: ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.4 శాతం.. 2025-26పై కేంద్ర ప్రభుత్వం ముందస్తు అంచనా  
ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.4 శాతం..2025-26పై కేంద్ర ప్రభుత్వం ముందస్తు అంచనా

India GDP Growth: ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.4 శాతం.. 2025-26పై కేంద్ర ప్రభుత్వం ముందస్తు అంచనా  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి చేరవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది రిజర్వ్ బ్యాంక్ (RBI) 7.3 శాతం గా అంచనా వేయడాన్ని కంటే కొంత ఎక్కువ. కేంద్ర గణాంకాల శాఖ బుధవారం విడుదల చేసిన ప్రథమ ముం దస్తు అంచనాల్లో,తయారీ,సేవల రంగాల మెరుగైన పనితీరు దీనికి కారణమని పేర్కొంది. ఈ వృద్ధి రేటుతో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థలలో తన స్థానం కొనసాగించనుంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) జీడీపీ వృద్ధి 6.5శాతంగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం జీడీపీ వృద్ధి 7.3 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది.

వివరాలు 

వ్యవసాయం డీలా.. 

తయారీ, నిర్మాణ రంగాలు సుమారుగా 7 శాతానికి వృద్ధి చెందుతాయని, సేవల రంగం జీవీఏ 9.1 శాతానికి పెరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. ప్రధాన పోటీ దేశం అయిన చైనా 2025లో 4.9%, 2026లో 4.4% వృద్ధి నమోదు చేయవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం,సంబంధిత రంగాల జీవీఏ 3.1 శాతానికి తగ్గనుందని, అలాగే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వంటి ఇతర యుటిలిటీ సేవలలో పరిమిత వృద్ధి మాత్రమే నమోదవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ ఏడాది ప్రస్తుత ధరల ఆధారిత నామినల్ జీడీపీ వృద్ధి రేటు సుమారుగా 8 శాతానికి చేరవచ్చని కూడా అంచనా. ఈ గణాంకాలను 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనలో ఉపయోగించనుంది.

వివరాలు 

రూ.200 లక్షల కోట్లకు జీడీపీ 

వచ్చే నెల 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాస్తవిక జీడీపీ సుమారుగా రూ.201.90 లక్షల కోట్లకు చేరవచ్చని కేంద్ర గణాంకాల శాఖ అంచనా వేసింది. 2024-25లో ఇది రూ.187.97 లక్షల కోట్లుగా నమోదు కాగా, తేడా 7.4 శాతం. నామినల్ జీడీపీ 2024-25లో రూ.330.68 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా, 2025-26లో 8 శాతం వృద్ధి చెంది రూ.357.14 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. ఫిబ్రవరిలో కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ ప్రకారం, నామినల్ జీడీపీ వృద్ధి 10.1 శాతంగా అంచనా వేయబడింది. అమెరికా డాలర్ పరంగా (రూ.90/డాలర్) భారత జీడీపీ ఈసారి సుమారుగా 3.97 లక్షల కోట్ల డాలర్లుగా నమోదయ్యే అవకాశముంది.

Advertisement

వివరాలు 

2026-27లో 6.8% వృద్ధి: గోల్డ్‌మన్‌ శాక్స్‌ 

రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.8శాతానికి పరిమితం కావచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్ అంచనా. అలాగే,ధరల సూచీలు పెరగడం వల్ల RBI కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం సగటు 3.9శాతానికి పెరుగుతుందని అంచనా. ఆర్థిక జోరు కొనసాగుతుంది.. దేశీయ వినియోగం,ప్రభుత్వ మూలధన వ్యయాలు వంటి సానుకూల అంశాల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5-7శాతం రేంజ్‌లో నమోదు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI),విదేశీ సంస్థాగత పెట్టుబడులు(FII)పెరుగుతూ రూపాయి బలోపేతానికి దోహదిస్తాయి.ప్రస్తుతం భారత్ "గోల్డిలాక్స్"దశలో ఉంది.అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణంతో..ఇది వచ్చే రెండుసంవత్సరాలు కొనసాగనుందని అంచనా.: ఎస్. మహేంద్ర దేవ్, PMEAC చైర్మన్

Advertisement

వివరాలు 

దిగుమతులు తగ్గి.. ఎగుమతులు పెరగాలి 

ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే, భారత్ దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచుకోవాల్సి ఉంది. పంట వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా మార్చడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే కాక, ముడిచమురు దిగుమతులను కూడా తగ్గించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

Advertisement