Stock Market: భారీ లాభాల తర్వాత మళ్లీ నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
భారీ లాభాలతో గత సెషన్లో ఉత్సాహంగా కనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ఆ జోరును కొనసాగించలేకపోయాయి. బుధవారం నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్,హెల్త్‌కేర్,మెటల్ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. మరోవైపు, మదుపర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమివ్వడంతో పాటు విదేశీ మదుపర్లు ఈక్విటీ షేర్లను విక్రయించడం కూడా సూచీల పతనానికి కారణమైంది. దీంతో గత సెషన్లో వచ్చిన లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 73,049.76 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.గత సెషన్లో 73,033.78 పాయింట్ల వద్ద ముగిసిన ఈ సూచీ.. ఆరంభంలో దాదాపు స్థిరంగా కనిపించింది. అయితే, రోజంతా లాభనష్టాల మధ్య కదలాడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో కనిష్ఠంగా 72,578.75 పాయింట్లకు పడిపోగా, గరిష్ఠంగా 73,195.26 పాయింట్లను తాకింది.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.15గా నమోదు
చివరకు 251.89 పాయింట్లు నష్టపోయి 72,781.89 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 99.25 పాయింట్లు కోల్పోయి 22,622.70 వద్ద స్థిరపడింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.15గా నమోదైంది.
సెన్సెక్స్‌లోని 30 ప్రధాన కంపెనీల షేర్లలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండిగో షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
మరోవైపు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హిందుస్థాన్ యునిలీవర్, ఎన్టీపీసీ, రిలయన్స్ షేర్లు లాభాలతో ముగిసి కొంత మద్దతునిచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి.
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 106.38 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం ధర ఔన్స్‌కు 4,143.48 డాలర్లుగా ఉంది.