IRCTC down: ఐఆర్‌సీటీసీ సేవలకు అంతరాయం.. వెబ్‌సైట్, యాప్‌లు మరో గంట పాటు చెయ్యవు
భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కోఆపరేషన్ (IRCTC)కి సంబంధించిన ఈ-టికెట్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది. సోమవారం ఆ సేవలు దాదాపు ఒక గంటపాటు పనిచేయవని సంస్థ ప్రకటించింది. నిర్వహణపరమైన పనులు చేపట్టడం వల్లే అది ఆగిపోయిందని పేర్కొంది. ఈ విషయాన్ని IRCTC తమ అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేసింది. ''నిర్వహణ పనుల కారణంగా ఈ టికెట్ సేవలు మరో గంటపాటు అందుబాటులో ఉండవు. తర్వాతి ప్రయత్నం చేయండి. టికెట్ రద్దు చేయడం లేదా ఫైల్ TDR చేయాలనుకుంటే, కస్టమర్ కేర్ నంబర్లు 14646, 0755-6610661, 0755-4090600 ద్వారా సంప్రదించండి లేదా etickets@irctc.co.in కు మెయిల్ చేయండి'' అని సంస్థ తెలిపింది.