
Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'
ఈ వార్తాకథనం ఏంటి
ట్విట్టర్‌కు పోటీగా భారత్‌లో పురుడుపోసుకున్న దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కూ(Koo) తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించింది.
తాజాగా లేఆఫ్స్‌తో కలిపి 'కూ' ఇప్పటి వరకు తన సిబ్బందిలో 30 శాతం మందిని తొలగించినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది.
ట్విట్టర్‌లో 1500మంది ఉద్యోగులు మాత్రమే మిగిలి ఉన్నారని, గత రెండు నెలల్లో 7000 మందికి పైగా తొలగించబడ్డారని ఎలోన్ మస్క్ చెప్పిన అనంతరం 'కూ' సైతం లేఆఫ్స్‌ను ముమ్మరం చేసింది.
కూ
భారీగా తగ్గిన 'కూ' స్టార్టప్ ఫండింగ్
ప్రస్తుత గ్లోబల్ సెంటిమెంట్ మధ్య కంపెనీ సామర్థ్యం, యూనిట్ ఎకనామిక్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నందున 'కూ' తన ఉద్యోగాలను తగ్గించిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెప్పింది.
తన ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్‌పై భారత అధికారులతో ట్విట్టర్ గొడవ కారణంగా కూ మొదట్లో ప్రజాదరణ పొందింది.
చాలా మంది భారతీయ ప్రముఖులు ప్రత్యామ్నాయంగా 'కూ' వైపు మళ్లారు. ఇదిలా ఉంటే 'కూ'కు వచ్చే స్టార్టప్ ఫండింగ్ కూడా తగ్గింది.
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే మార్చితో ముగిసిన త్రైమాసికంలో 'కూ' ఫండింగ్‌లో 75 శాతం తగ్గుదలని నివేదించింది.