LOADING...
Menstrual leave: ఎల్‌అండ్‌టీలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు  
ఎల్‌అండ్‌టీలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

Menstrual leave: ఎల్‌అండ్‌టీలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ సంస్థ ఎల్‌అండ్‌టీ (L&T) మహిళా ఉద్యోగుల కోసం నెలసరి సమయంలో ఒకరోజు చెల్లింపు సెలవును (పెయిడ్ లీవ్) ప్రకటించింది. ఈ నిర్ణయం దాదాపు 5,000 మంది మహిళా ఉద్యోగులకు ప్రయోజనం కలిగించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ఒక కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రయోజనం ఎల్‌అండ్‌టీ మాతృ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులకు మాత్రమే వర్తించనుండగా, ఫైనాన్షియల్‌, టెక్నాలజీ వంటి అనుబంధ సంస్థల్లో పనిచేసే వారికి ఇది వర్తించదు.

వివరాలు 

ఈ విధానాలను అమలు చేస్తున్న స్విగ్గీ, జొమాటో

ఇటీవల ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యన్‌ వారానికి 90 గంటలు పని చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో, ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో వంటి ప్రముఖ సంస్థలు కూడా ఇలాంటి విధానాలను అమలు చేస్తున్నాయి. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ రాష్ట్రాలు నెలసరి సెలవుపై ప్రత్యేక విధానాలను అమలు చేస్తుండగా, గత ఏడాది సుప్రీంకోర్టు కూడా దీనిపై పాలసీ రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్‌అండ్‌టీ సంస్థలో మొత్తం 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు, వారిలో 9 శాతం అంటే దాదాపు 5,000 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు.