Page Loader
Lay's potato chips recall: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక.. భారీగా లేస్ పాకెట్స్ ను రీకాల్
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక.. భారీగా లేస్ పాకెట్స్ ను రీకాల్

Lay's potato chips recall: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక.. భారీగా లేస్ పాకెట్స్ ను రీకాల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఒరేగాన్, వాషింగ్టన్‌లో 6,344 బ్యాగుల లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌ను క్లాస్ 1 రీకాల్‌గా ప్రకటించింది. ఈ రీకాల్ డిసెంబర్ 13న ప్రకటించబడింది, కానీ జనవరి 27న FDA దీనిని అత్యధిక ప్రమాద స్థాయికి (క్లాస్ 1) పెంచింది. దీనికి కారణం, ఈ ఉత్పత్తిలో వెల్లడి చేయని పాల (Milk) మిశ్రమం ఉన్నది. ఈ మిశ్రమం కొంతమంది వ్యక్తులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు అని FDA తెలిపింది. FDA ప్రకారం, క్లాస్ 1 రీకాల్ అనేది అత్యంత ప్రమాదకరమైన రీకాల్‌గా పరిగణించబడుతుంది, ఎందుకంటే దీనిని తినడం వల్ల "తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా మరణం" సంభవించే ప్రమాదం ఉంది.

వివరాలు 

6,344 బ్యాగులు రీకాల్

వీటిలో వాపు, మతి స్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు రాబడతాయని హెచ్చరించింది. ఫ్రిటో-లేస్ కంపెనీ ఒక వినియోగదారు ఫిర్యాదు చేసిన తరువాత, ఈ రీకాల్‌ను స్వచ్ఛందంగా అమలు చేసింది. ఈ రీకాల్ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్‌కు మాత్రమే వర్తిస్తుంది.ఇవి ఒరేగాన్,వాషింగ్టన్‌లోని రిటైల్, ఆన్‌లైన్ స్టోర్లలో విక్రయించబడ్డాయి. మొత్తం 6,344 బ్యాగులు రీకాల్ చేయబడ్డాయి. డిసెంబర్ 16న ఫ్రిటో-లేస్ ప్రకటించిన ప్రకటనలో "ఈ సమస్యకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అలెర్జిక్ రియాక్షన్లు నమోదుకాలేదు.ఇతర లేస్ ఉత్పత్తులు,ఫ్లేవర్లు,పరిమాణాలు లేదా వెరైటీ ప్యాక్స్ రీకాల్ చేయబడలేదు" అని స్పష్టం చేసింది. ఇకపోతే, జనవరి నెలలో FDA అనేక ఉత్పత్తులను వెనక్కి తీసుకుంది. వాటిలో 10 ఉత్పత్తుల్లో వెల్లడి చేయని అలెర్జెన్స్ ఉన్నాయని గమనించవచ్చు.