Page Loader
Charlie Munger: వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ ముంగెర్ కన్నుమూత 
Charlie Munger: వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ ముంగెర్ కన్నుమూత

Charlie Munger: వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ ముంగెర్ కన్నుమూత 

వ్రాసిన వారు Stalin
Nov 29, 2023
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా బిలియనీర్, వారెన్ బఫెట్‌(Warren Buffett) చిరకాల మిత్రుడు, ఆయన వ్యాపార సామ్రాజ్యంలో కీలక భాగస్వామి అయిన చార్లీ ముంగెర్ (99) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రిలో మంగళవారం ముంగర్ (Charlie Munger) తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారెన్ బఫెట్ వ్యాపార సామ్రాజ్యంలో చార్లీ ముంగెర్ అతిపెద్ద వాటాదారు కావడం గమనార్హం. వారెన్ బఫెట్ కంపెనీ అయిన బెర్క్‌షైర్ హాత్వే‌(Berkshire Hathaway)కు ముంగెర్ కొన్ని దశాబ్దాల పాటు వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. చార్లీ మరణంపై వారెన్ బఫెట్ స్పందించారు. చార్లీ కృషి లేకుండా బెర్క్‌షైర్ హాత్వే కంపెనీ ప్రస్తుత స్థితికి చేరుకోలేదన్నారు. వారెన్ బఫెట్ లాగే చార్లీ కూడా తన సంపదలో చాలా భాగం దాతృత్వ సేవలకు ఖర్చు చేసారు.

చార్లీ

1959లో చిగురించిన బఫెట్, చార్లీ మధ్య స్నేహం 

1924లో ఒమాహాలో జన్మించిన ముంగెర్ హార్వర్డ్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. వారెన్ బఫెట్ కూడా ఒమాహాలోనే పుట్టి పెరిగారు. ఇద్దరు మాత్రం 1959లో యుక్త వయసులో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. దాదాపు 60ఏళ్లుగా బఫెట్, చార్లీ మధ్య స్నేహం కొనసాగుతోంది. ముంగెర్ 1978లో బెర్క్‌షైర్ హాత్వే కంపెనీకి వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పడు అది ఒక చిన్న టెక్స్‌టైల్ కంపెనీ. ఆ తర్వాత బఫెట్, చార్లీ కృషితో ఆ కంపెనీ 780బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా అభివృద్ధి చెందింది. బెర్క్‌షైర్ హాత్వే కంపెనీలో ఆయన చనిపోయే నాటికి కూడా ముంగెర్ అధికారికంగా పదవీ విరమణ చేయలేదు. జనవరి 1, 2024న అతను 100ఏళ్లు పూర్తి చేసుకుంటారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టిమ్ కుక్ నివాళి