
paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
చాలా రోజుల తర్వాత పేటీఎం బ్రాండ్‌తో సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ షేర్ విలువ సోమవారం భారీగా పెరిగింది.
ప్రారంభ సెషన్ లో షేరు విలువ ఏకంగా 11 శాతానికి పైగా పెరిగింది.
కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) విజయ్ శేఖర్ శర్మ పేటీఎంకు చెందిన యాంట్‌ఫిన్ హోల్డింగ్ బీవీ (నెదర్లాండ్స్) నుంచి 10.30 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రకటన నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 11.57 శాతం పెరిగి రూ.887.55కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో షేరు ధర 11.43 శాతం పెరిగి రూ.887.70కి చేరుకుంది.
ఈ డీల్ పూర్తయిన తర్వాత పేటీఎంలో విజయ్ శేఖర్ శర్మ వాటా 19.42 శాతానికి పెరిగింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
19.42శాతానికి పెరిగిన విజయ్ శేఖర్ వాటా
Vijay Shekhar Sharma is set to acquire a 10.3% stake in Paytm from Antfin, increasing his shareholding to 19.42%. 🤯
— Quest By Finology (@Finology_Quest) August 7, 2023
Following this news, Paytm's stock has risen by 11%. 📈
Antfin's stake sale, Founder's stake buy: Good or bad for #Paytm?
There is a catch. 😉
A must-read 🧵 pic.twitter.com/hnjyi3NRii