RBI Rate Hike: డిసెంబర్‌లో షాకివ్వనున్న ఆర్బీఐ...వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచే ఆలోచన
ఈ వార్తాకథనం ఏంటి
డిసెంబర్ పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరుకోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి బలంగా ఉన్నప్పటికీ, ధరల పెరుగుదలపై ఆర్‌బీఐ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని నివేదిక పేర్కొంది. గతంలో 25 బీపీఎస్ పెంపును అంచనా వేసిన ఎస్‌బీఐ రీసెర్చ్ ఇప్పుడు ఆ అవకాశాన్ని చాలా తక్కువగా చూస్తోంది.
Details
అంచనా ఎందుకు మారింది?
అక్టోబర్‌లోనే 50 బీపీఎస్ పెంపు అవసరమని ఎస్‌బీఐ రీసెర్చ్ సూచించింది. అయితే నవంబర్ నివేదికలో దాన్ని 25 బీపీఎస్‌కు తగ్గించింది.
రూపాయి బలపడటం, దేశంలోకి భారీగా పెట్టుబడులు రావడం, అంచనాల కంటే తక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం వంటి అంశాలను అప్పట్లో కారణాలుగా చూపించింది.
ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిందని నివేదిక చెబుతోంది. ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరడంతో ధరల ఒత్తిడి మళ్లీ స్పష్టంగా కనిపిస్తోందని, ఈ నేపథ్యంలో 50 బీపీఎస్ పెంపు వైపు ఆర్‌బీఐ వెళ్లొచ్చని పేర్కొంది.
Details
మార్కెట్లపై ప్రభావం ఎలా?
ఆర్‌బీఐ 50 బీపీఎస్ పెంపు చేస్తే బాండ్ ఈల్డ్స్ తొలుత పెరిగే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ తెలిపింది.
మార్కెట్ దీన్ని భవిష్యత్‌లో మరిన్ని రేట్ హైక్‌లకు సంకేతంగా భావించే అవకాశం ఉంది. మరోవైపు విదేశీ మారక మార్కెట్‌పైనా ఒత్తిడి రావచ్చని అంచనా వేసింది.
అధిక వడ్డీ కారణంగా డెట్ ఇన్‌ఫ్లోలు పెరిగినా, ఈక్విటీ పెట్టుబడులపై ప్రభావం పడొచ్చని పేర్కొంది.
ముఖ్యంగా గృహ రుణాలు, ఎంఎస్‌ఎంఈ రుణాలపై వడ్డీ భారం పెరగడం ఆందోళన కలిగించే అంశమని తెలిపింది.
2027లో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయి నవంబర్‌లో దాటుతుందని, ఆ తర్వాత FY28లో ఆర్‌బీఐ పాలసీ వైఖరిని 'న్యూట్రల్'గా మార్చే అవకాశం 70 శాతం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.