ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రిచెస్ట్ ఉమెన్! ఎవరీ మహిమా దాట్ల?
భారతీయ మహిళలు తమ సొంత నిర్ణయాలతో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన మహిమ దాట్ల 45 ఏళ్లకే 8700 కోట్లు సంపాదించింది. ప్రస్తుతం ఈమె పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఇంత మొత్తానికి ఆమె ఎలా అధిపతి అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1953 సంవత్సరంలో ఫర్మా మార్గదర్శకులలో ఒకరైన దాట్ల వెంకట క్రిష్ణంరాజు దాట్ల బయోలాజికల్ ఈ అనే ఫార్మా సంస్థను స్థాపించారు. రక్తం గడ్డకుండా నిరోధించే హెపారిన్ అనే మెడిసిన్ కనుగొనడంతో ఈ పార్మా సంస్థ ప్రస్థానం మొదలైంది. ఈ ఫార్మా వెంకట క్రిష్ణం రాజుగారి తర్వాత ఆయన కుమారుడు విజయ్ కుమార్ దాట్ల చేతుల్లోకి వెళ్లింది. ఆ విజయ్ కుమార్ కుమార్తె ఈ మహిమ దాట్ల.
బయోలాజిక్ ఈ సీఈఓగా మహిమా దాట్ల
మహిమ దాట్ల లండన్ లోని వెబ్స్టర్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. 2021 నుండి బయోలాజిక్ ఇ లో తన వంతు కృషి చేసింది. 2013 విజయ్ కుమార్ చనిపోవడంతో బయోలాజికల్ ఈ బాధ్యతలను మహిమ దాట్ల చేపట్టింది. అప్పటి నుంచి ఆ సంస్థ సీఈఓగా ఆమె పనిచేస్తోంది. 10ఏళ్ల కాలంలో 200 కోట్లకు పైగా డోస్‌లతో 100 దేశాలకు వ్యాక్సిన్ లను సరఫరా చేసిన ఘనత ఆ సంస్థకే దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ బయోలాజికల్ ఈ సంస్థే తయారు చేసింది. గతేడాది 7700 కోట్లుగా ఉన్న ఆమె ఆస్తి విలువ ఈ ఏడాది 1000 కోట్లు పెరిగి 8700 కోట్లకు చేరుకుంది.