Getty Images: షటర్‌స్టాక్-గెట్టీ ఇమేజెస్ విలీనం.. 31,700 కోట్లు విలువైన డీల్
ఈ వార్తాకథనం ఏంటి
షటర్‌స్టాక్‌ను గెట్టీ ఇమేజెస్ కొనుగోలు చేస్తున్నాయి, ఈ రెండు సంస్థల విలీనం ద్వారా 3.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.31,700 కోట్ల) విలువతో విజువల్ కంటెంట్ కంపెనీ ఏర్పడనుంది.
కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించే చిత్రాలతో పోటీ పెరిగిన నేపథ్యంలో ఈ విలీనం జరగడం గమనార్హం.
ఈ విలీనం వల్ల వినియోగదారులకు చిత్రాలు, వీడియోలు, సంగీతం, 3డీ, ఇతర మీడియా ఉత్పత్తుల విస్తృత ఎంపిక లభిస్తుంది.
విజువల్ కంటెంట్‌కు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని, ఈ విలీనం సరైన సమయానికీ జరగడం గెట్టీ ఇమేజెస్ సీఈఓ క్రెగ్ పీటర్స్ పేర్కొన్నారు.
Details
సీఈఓగా పీటర్స్
ఈ విలీనం తర్వాత గెట్టీ ఇమేజెస్ సీఈఓగా పీటర్స్ కొనసాగిస్తారు. విలీనం తర్వాత గెట్టీ ఇమేజెస్ వాటాదార్లకు 54.7శాతం వాటా, షటర్‌స్టాక్ వాటాదార్లకు 45.3శాతం వాటా ఉంటుంది.
షటర్‌స్టాక్ షేర్‌హోల్డర్లు తమ ఒక్కో షేరుకు 28.85 డాలర్ల నగదు లేదా ప్రతి షటర్‌స్టాక్ షేరుకు 13.67 గెట్టీ ఇమేజెస్ షేర్లు లేదా 9.17 షేర్లు, 9.50 డాలర్ల నగదు ఎంపిక చేసుకోవచ్చు.
విలీనం చేసిన సంస్థ గెట్టీ ఇమేజెస్ పేరుతో కొనసాగుతుంది, ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అదే పేరుతో ట్రేడవుతుంది.